Koratala Siva – NTR30 | సినిమా ఇండస్ట్రీలో జాతకం మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు.. ఆకాశంలో ఉన్న వాళ్లను పాతాళానికి పాతాళంలో ఉన్న వాళ్లను నిచ్చెన ఎక్కించి ఆకాశానికి తీసుకెళ్లడానికి.. ఇక్కడ ఒక్క శుక్రవారం చాలు. అలాంటి ఒక ఫ్రైడే కొరటాల శివ కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. ఆరు నెలల కింద వరకు ఈయన బ్లాక్ బస్టర్ డైరెక్టర్. కొరటాల అడిగాడు అంటే నో చెప్పే హీరో ఇండస్ట్రీలోనే లేడు. అలాంటి ట్రాక్ రికార్డు ఈయన సొంతం కానీ.. ఆచార్య సినిమా తర్వాత కొరటాలపై అందరికీ నమ్మకం తగ్గిపోయింది. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా దాదాపు 70 కోట్లకు పైగా నష్టాలు తీసుకువచ్చింది.
పైగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించాడు. తండ్రీకొడుకులు ఉన్నా కూడా సబ్జెక్టు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అంటూ కొరటాల శివపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ ఒక్క ఫ్లాట్‌తో ఆయన గతంలో తీసిన హిట్ సినిమాలన్నింటినీ మర్చిపోయారు. దాంతో మళ్లీ ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టాడు కొరటాల. చేతిలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉన్నా కూడా అది ఎంతకీ మొదలవడం లేదు. ఇప్పటికే చెప్పిన కథలో తారక్ ఎన్నో మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. దాదాపు 50 శాతానికి పైగా ఎన్టీఆర్ మార్పులు చెప్పడంతో.. కథను పూర్తిగా మేకోవర్ చేయాలని కొరటాల భావిస్తున్నాడు.
దీనికోసం కావాల్సిన కసరత్తులు మొదలుపెట్టాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో మొదలవడం కష్టమే. కాకపోతే కొరటాలకు కావాల్సినంత ధైర్యం ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఫ్లాప్ వచ్చినా కూడా కొరటాలపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఎందుకంటే కొన్నేళ్లుగా ఫ్లాప్ దర్శకులతోనే వరుస విజయాలు అందుకుంటున్నడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ సినిమాకు ముందు పూరీ జగన్నాథ్.. నాన్నకు ప్రేమతో సినిమాకు ముందు సుకుమార్.. జై లవకుశ సినిమాకు ముందు బాబీ.. అరవింద సమేతకు ముందు త్రివిక్రమ్ ఫ్లాప్స్ లోనే ఉన్నారు. అయినా వాళ్లను నమ్మి సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు తారక్.
కొరటాల శివ విషయంలో కూడా ఇదే జరుగుతుందని నందమూరి అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. పైగా గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది. కొరటాల రైటర్‌గా ఉన్నప్పుడు పని చేసిన బృందావనం సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఏదేమైనా కూడా ఆచార్య హిట్ అయ్యుంటే.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఈపాటికి సెట్స్ పైకి వెళ్ళేది.. అది ఫ్లాప్ అయింది కాబట్టి కొరటాలకు ఎన్ని కష్టాలు వచ్చాయి అనేది మాత్రం కాదనలేని వాస్తవం.
“ఎన్టీఆర్ సినిమాకు అసలు సమస్య ఎక్కడుంది..?”