ఎన్టీఆర్ సినిమాకు అసలు సమస్య ఎక్కడుంది..?
Junior NTR and Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయి చాలా రోజులు అయింది. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. దానికి కారణం ఆచార్య ఫెయిల్యూర్ కావడమే అని సోషల్ మీడియాలో వార్తలు చాలానే వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆచార్య ప్లాప్ అయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా క్యాన్సిల్ చేసుకునేవాడు కానీ.. కంటిన్యూ అయ్యేవాడు కాదు కదా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం.. ఆచార్య ఒకవేళ హిట్ అయి ఉంటే ఈపాటికి సినిమా మొదలయ్యేది. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతోనే స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయడానికి కొరటాల శివ సిద్ధమవుతున్నాడు. పైగా పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల వాళ్లకు నచ్చేలా ఈ స్క్రిప్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నాడు ఎన్టీఆర్.
ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు నేషనల్ వైడ్‌గా మంచి ఫాలోయింగ్ వచ్చింది. అది నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా అద్భుతమైన స్క్రిప్ట్ తో రావాల్సిందే. ఏ మాత్రం తేడా కొట్టిన ప్రభాస్‌కు ఎదురైన పరాభావాలు రిపీట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే కొరటాల సినిమా విషయంలో ఆలస్యమైనా ఫర్లేదు అంటున్నాడు ఎన్టీఆర్. పైగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి జోరు మీదున్నాడు. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడానికి అసలు ఇష్టపడటం లేదు తారక్. అందుకే కొరటాల సినిమా ఇంకా లేట్ అవుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.
Read More :
“Jr NTR | ‘బింబిసార’ బిజినెస్ కోసమే తారక్ పేరు వాడుకుంటున్నారా..?”
“Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!”
“Koratala Siva Next Project’s | ఆ ముగ్గురు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన కొరటాల శివ?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- koratala siva
- NTR
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

