Buchi Babu Sana | ఉప్పెన డైరెక్టర్ వెయిటింగ్..మరి ప్రకటన ఎప్పుడో..?
స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు బుచ్చి బాబు సాన (Buchi Babu Sana). వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఉప్పెన చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఉప్పెన (Uppena) చిత్రంతో టాలీవుడ్ (Tollywood)కు డైరెక్టర్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బుచ్చి బాబు సాన (Buchi Babu Sana). స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఉప్పెన చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్టుపై వార్తలు తెరపైకి వచ్చినా..ఇప్పటికీ ఆ సినిమా ఏంటనేది ప్రకటించలేదు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)తో సినిమాపై చర్చలు కొనసాగుతున్నాయని, ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథను వినిపించగా…బుచ్చి బాబు చెప్పిన కథకు తారక్ ఇంప్రెస్ అయ్యాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీపై ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. ఇటీవలే మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30, 31వ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. కానీ బుచ్చిబాబు సినిమా న్యూస్ మాత్రం రాలేదు.
మొత్తానికి బుచ్చిబాబు రెండో సినిమా ఏంటో చెప్పకుండా..ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉండటం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మరి రానున్న రోజుల్లోనైనా తన రెండో సినిమాపై బుచ్చి బాబు నుంచి ఏదైనా ప్రకటన వస్తుందోమో చూడాలి. కొరటాల శివతోపాటు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమాలు మాస్ ఓరియెంటెడ్ స్టోరీలతో రాబోతున్నాయి. మరి బుచ్చిబాబు-తారక్ సినిమా వస్తుందా..? లేదా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

