ఒక్కో రేకా ఒక్కో క్లిప్పు
చూస్తే పువ్వులా ఉంటుంది. మ్యాగ్నట్ సాయంతో దాన్ని ఫ్రిజ్, బీరువాలాంటి వాటికి అలంకరించొచ్చు కూడా.
చూస్తే పువ్వులా ఉంటుంది. మ్యాగ్నట్ సాయంతో దాన్ని ఫ్రిజ్, బీరువాలాంటి వాటికి అలంకరించొచ్చు కూడా. కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ పువ్వులోని ఒక్కో రేకనూ తీసి ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే పూరేకల్లా కనిపిస్తున్నవన్నీ తెరిచిన ఫుడ్ బ్యాగ్‌లను లాక్ చేసేందుకు వాడే క్లిప్పులే మరి. మనం చిప్స్, కారప్పూసలాంటి స్నాక్స్‌తో పాటు టీ, కాఫీ పొడుల్లాంటి వాటిని కవర్లు తెరిచి ఉపయోగించుకుంటాం.
కానీ ఒకేసారి మొత్తం వాడనప్పుడు చివర్లు మడిచి పక్కన పెడతాం. అలాంటప్పుడు అవి తాజాగా ఉండాలంటే మడిచిన చోట చిన్న క్లిప్ పెడితే ఇక, లోపలికి గాలి చొరబడదు. ఇందుకోసం వినియోగించే క్లిప్‌లు అందుబాటులో ఉండేలా, అందంగానూ కనిపించేలా రూపొందించినవే ‘ఫ్లవర్ బ్యాగ్ క్లిప్’లు. దీని మధ్యలో ఉండే భాగానికి అయస్కాంతం ఉండటం వల్ల అవి ఇనుప డోర్లకు అతుక్కుని ఉంటాయన్న మాట. మంచి ఐడియా కదూ!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

