కొత్త బాస్‌తో ఇలా!

నేను ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌ను. తొలుత ఒక చిన్న కంపెనీలో పని చేశాను. ఈమధ్యే ఎమ్మెన్సీలో మంచి జీతానికి చేరాను. కానీ, ఇక్కడ వర్క్‌లోడ్ ఎక్కువ. ఈ ఉద్యోగానికి కొత్త కాబట్టి, రకరకాల ప్రాసెస్లను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నా డౌట్స్ అడుగుతుంటే పై అధికారి కోప్పడుతున్నారు. నేను ‘దేనికీ పనికి రానంటూ’ తిడుతున్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అవడం వల్ల నా బాధలను చూసి మా ఇంట్లోవాళ్లుకూడా అప్సెట్ అవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడే మార్గం ఏమిటి?
-ఓ సోదరి
ఒత్తిడి, బాసిజం ఎక్కువగా ఉన్న వాతావరణంలో పని చేయడం సులభం కాదు. మానసిక ఒత్తిడితో నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది. డిప్రెషన్, హైబీపీ, మైగ్రేన్, బరువు పెరగడం లేదా తగ్గడం లాంటివన్నీ తీవ్ర ఒత్తిడి లక్షణాలే. ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. కుటుంబసభ్యులమీద చిరాకు పడతారు. కమిట్మెంట్ ఉంటే తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
- బాస్‌ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.ఉన్నతాధికారుల ఒత్తిడి లేదా ఇంట్లోని సమస్యలు ఆ కోపానికి కారణం కావచ్చు. అందువల్ల ఒక్కోసారి మీ ఓపిక, సహనమే అవతలి మనుషులను మార్చే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్నిసార్లు మన అసౌకర్యానికి అవతలి వాళ్లను బ్లేమ్ చేస్తుంటాం. తోటి ఉద్యోగులకూ ఇలాంటి అనుభవాలున్నాయేమో తెలుసుకోండి.
- బాస్ మాటలు మీ సామర్థ్యంపై నెగెటివ్ ప్రభావం చూపిస్తున్న విషయాన్ని అతనికి తెలిసేలా చెప్పాలి. గ్రూప్ మీటింగ్స్‌లో కాకుండా ప్రైవేట్‌గా ఫోన్ చేసి మాట్లాడాలి. అవకాశాలను అందుకుంటూ బాస్‌ని ఇంప్రెస్ చేయాలి. తర్వాత అతనికి మీపై మంచి అభిప్రాయం ఏర్పడి మీ సమస్య మెల్లిగా తీరిపోతుంది.
- బాస్ ప్రవర్తన తెలుసు కాబట్టి, ముందుగానే అన్నిటికీ సన్నద్ధమై ఉండాలి. ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా నోట్ బుక్ లేదా డైరీలో రాసుకోవాలి. ఏదేమైనా ఉద్యోగంలోని ఒత్తిడి కారణంగా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదు. దేన్నైనా మనోస్థయిర్యంతో ఎదుర్కోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కాంప్రమైజ్ అయినా మీ బాస్‌లో మార్పు రాకపోతే, వేరే ఉద్యోగం చూసుకోవడం బెటర్ ఆప్షన్.

Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

