Shreya katuri | అగ్గిపెట్టెల సేకరణే ఆమె లోకం.. వాటితో ఏం చేస్తుందో తెలిస్తే షాకవ్వల్సిందే

shreya katuri | అగ్గిపెట్టెను చాలామంది వంటింటి వస్తువుగానో.. చుట్ట, బీడీ, సిగరెట్ అభిమానుల జేబు సరుకుగానో చూస్తారు. కానీ, మీరెప్పుడైనా అగ్గిపెట్టెను నిశితంగా గమనించారా? వాటిపై ఉండే కళాఖండాలను ఆస్వాదించారా? అసలు మనదేశంలో ఎన్ని రకాల అగ్గిపెట్టెలు ఉన్నాయో తెలుసా? ఆ సమాచారమంతా కాటూరి శ్రేయకు తెలుసు. ఎందుకంటే ఆమెకు అగ్గిపెట్టెలే లోకం.

న్యూఢిల్లీ నివాసి శ్రేయ కాటూరి (28).. పదేండ్ల క్రితమే అగ్గిపెట్టెలపై మనసు పారేసుకుంది. వాటిపై ఉండే రకరకాల డిజైన్లు ఆమెను ఆకట్టుకున్నాయి. అవన్నీ డిజైన్లు మాత్రమే కాదు.. మన చరిత్ర, సంస్కృతిని నలుదిశలా వ్యాపింపజేసే మాధ్యమాలు. ‘ప్రతి అగ్గిపెట్టెకు ఓ కథ ఉంటుంది. ఆ చిహ్నాలు, డిజైన్లు నాలో ఆసక్తిని రేకెత్తించాయి’ అంటున్నది శ్రేయ. అగ్గిపెట్టెలను సేకరించేందుకే ఇటీవల ఢిల్లీ నుంచి కెనడాకు ప్రయాణం అయ్యిందామె. ఈ యువతి ఇప్పటివరకూ దాదాపు 5 వేలకు పైగా దేశ విదేశాల అగ్గిపెట్టెలను సేకరించింది. తన ఇన్‌స్టా పేజీ ‘ఆర్ట్ ఆన్ ఏ బాక్స్’లో ఆ ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటుంది. శ్రేయ దగ్గర స్వాతంత్య్రానికి పూర్వం నాటి అగ్గిపెట్టెలూ ఉన్నాయి. కాలాను గుణంగా అగ్గిపెట్టెలపై డిజైన్లు ఎలా మారాయి? ఎలా అభివృద్ధి చెందాయి? అనే దానిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నదామె.


లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. ఆమె విజయ రహస్యమిదే..
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..
Keerthi priya | రైతన్నలకు అండగా సూర్యాపేట యువతి.. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..
nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- match box
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

