కెఫేలో పనిచేశా

తన పేరు వెనకాల ఇంటిపేరును మాత్రమే తగిలించుకుందామె! అదీ అవకాశాల కోసం కాదు. తండ్రిమీద అభిమానంకొద్ద్దీ! బాలీవుడ్ నటుడు శక్తి కపూర్‌కు కావాల్సినంత పేరుంది. చెప్పుకోదగ్గ పరిచయాలూ ఉన్నాయి. అయినా, ఆయన తనయ శ్రద్ధాకపూర్ మాత్రం చెట్టు పేరు చెప్పుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. చెట్టంత ఎదిగింది. తండ్రిని మించిన కూతురైంది.
సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్న చిన్నారులను చూస్తుంటే జాలేస్తుంది. మనం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. నా చిన్నప్పుడు ఇంట్లో ఉంటే ఒట్టు! బడినుంచి రాగానే చకచకా హోమ్‌వర్క్స్ కంప్లీట్ చేసుకొని, వీధిలోకి వచ్చేసేదాన్ని. అప్పటికే ఇరుగుపొరుగు పిల్లలంతా పోగయ్యేవాళ్లు. గంటల తరబడి ఆడేవాళ్లం. జట్లు జట్లుగా విడిపోవడం, పేచీలు పెట్టుకుంటూ ఆడుకోవడం.. అవన్నీ గుర్తు చేసుకుంటే భలే సరదాగా అనిపిస్తుంది.
జంతువులంటే నాకు ప్రాణం. జంతువుల హక్కులపై పోరాడేవారికి ఎప్పుడూ మద్దతుగా ఉంటాను. మూగజీవులపై మమకారంతోనే తోలు ఉత్పత్తులు వాడటం మానేశాను. అంతేకాదు, పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయాను. నిలువనీడనిచ్చిన భూమిని కాపాడుకోవడం మనిషి బాధ్యత. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలి. పర్యావరణానికి కీడు చేయకుండా బతకడం అలవాటు చేసుకోవాలి.
ఇప్పుడంటే ‘కాల్షీట్కు ఇంత..’ అని సంపాదిస్తున్నాను కానీ, నా మొదటి సంపాదన 42 డాలర్లు. ఆ మొత్తం చేతికి అందగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. నేను బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్యాంపస్‌లోని స్టార్‌బక్స్ కెఫేలో పనిచేశా. కాఫీ కలుపడం, సాండ్విచ్ ప్రిపేర్ చేయడం వంటి పనులు చేసేదాన్ని. అప్పుడు నేను అందుకున్న తొలి వేతనం 42 డాలర్లు. కష్టపడి రూపాయి సంపాదించినా సంతృప్తి ఉంటుంది. అఫ్కోర్స్, వెంటనే బాగెల్ కేఫ్‌కు వెళ్లిపోయి ఆ డబ్బుతో నాకు నచ్చిన ఫుడ్ లాగించేశాను.
నేను సినిమాల్లోకి వస్తానంటే నాన్న అభ్యంతరం చెప్పలేదు. అలాగని, నా పేరు ఏ నిర్మాతకు, దర్శకుడికి సిఫారసు చేయలేదు. నిజాయతీగా కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని మాత్రం అనేవారు. నన్ను స్క్రీన్‌మీద చూసిన తర్వాత నాకన్నా నాన్నే ఎక్కువ సంతోషించారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

