బాలీవుడ్లో బిజీగా ఉన్న తారల్లో శ్రద్ధాకపూర్ ఒకరు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ మెరుపు తీగ ఎంత బిజీగా ఉన్నా జిమ్‌కు మాత్రం శ్రద్ధగా వెళ్తుంటుంది. అవుట్డోర్ షూటింగ్స్ ఉన్నప్పుడు శిక్షకులు సూచించిన వర్కవుట్లు క్రమం తప్పకుండా చేస్తుందట. స్థానికంగా ఉంటే.. ఉదయమో, సాయంత్రమో జిమ్‌కు వచ్చి ట్రైనర్ల పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తుందట.
లూప్బ్యాండ్స్, థెరాబ్యాండ్స్, ైస్లెడ్స్ వంటి కసరత్తులు చేస్తుంటుంది శ్రద్ధ. ఎప్పటికప్పుడు తనను తాను సానబెట్టుకుంటుంది. భోజనప్రియురాలిగా పేరున్న శ్రద్ధ ఫిట్నెస్ కోసం నోరు కట్టేసుకుంటుంది. న్యూట్రిషనిస్ట్ సలహా మేరకే ఆహారం తీసుకుంటుంది. ఆల్మండ్ క్రీమ్ చీజ్ కేక్స్, అవకాడో టోస్ట్ రెగ్యులర్‌గా డైట్లో ఉండేలా చూసుకుంటుంది. మసాలా చాయ్ ఇష్టంగా తాగుతుంది. పోషకాల ఖజానాగా పేరున్న క్వినోవా బిర్యానీ తరచూ రుచి చూస్తుంది.