e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జిందగీ అందుకే..సినిమాలకు దూరం!

అందుకే..సినిమాలకు దూరం!

ఆమె బాగా చదివి డాక్టర్‌ కావాలనుకుంది. కానీ, తన కూతురిని తెరమీద చూసుకుని మురిసి పోవాలన్నది తల్లి కోరిక. అమ్మ కల నెరవేర్చేందుకు పన్నెండేండ్ల వయసులో నటిగా మారింది జీ తెలుగు ‘రామ చక్కని సీత’ జ్యోతి. కొన్నాళ్ళు నటించి మానేద్దామనుకున్నా,
సీరియల్స్‌నే కెరీర్‌గా మార్చేసుకుంది. హీరోయిన్‌గా అవకాశాలు వచ్చినా, కొన్ని కారణాలవల్ల చేయలేదంటున్న జ్యోతి ‘జిందగీ’తో పంచుకున్నముచ్చట్లు.

అందుకే..సినిమాలకు దూరం!

మా అమ్మకు సినిమాలంటే ఇష్టం. నాకేమో చదువుపట్ల ఆసక్తి. నన్ను యాక్టర్‌గా చూడాలనుకుంది అమ్మ. డాక్టర్‌ కావాలనుకున్నాను నేను. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. నా చిన్నప్పుడే కుటుంబం చెన్నైకి షిఫ్ట్‌ అయ్యింది. అక్కడే నా చదువంతా. మా పక్కింటి అమ్మాయి సీరియల్స్‌లో నటించేది. తను చేస్తున్న సీరియల్లో ఓ పాత్రకు కొత్తవారిని వెతుకుతున్నారని తెలిసింది. అమ్మ నన్ను చేయమని అడిగింది. అప్పటివరకూ నాకు నటించాలనే ఆలోచనే లేదు. కానీ, అదో పెద్ద ప్రాజెక్ట్‌. హీరోయిన్‌ నిరోషగారి కూతురి పాత్రని చెప్పారు. వారం రోజులు చాలని కూడా అన్నారు. కాదనడానికి కారణం కనిపించలేదు. మొదటి సారిగా ‘తాయి పాకం’ అనే తమిళ సీరియల్లో నటించా.

- Advertisement -

మానేద్దామనుకున్నా..
అమ్మకోసం ఒక్క సీరియల్‌ చేసి మానేద్దామనుకున్నా. కానీ, ఆ సీరియల్‌ పూర్తి కాకముందే మరో ఆఫర్‌ వచ్చింది. వెంటవెంటనే అవకాశాలు రావడంతో మరో ఆలోచన లేకుండా కొనసాగాను. మొదట్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా, రెండు మూడు ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి నాకూ ఆ వాతావరణం నచ్చింది. దాంతో నటన కెరీర్‌గా మారిపోయింది. సినిమాల్లోనూ హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. కానీ, నాకు స్కిన్‌ షో ఇష్టం ఉండదు. హీరోయిన్‌ అంటేనే రొమాన్స్‌. రకరకాల దుస్తులు వేసుకోవాలి. అందుకే, ఒప్పుకోలేదు. అయితే అర్జున్‌, విజయ్‌ వంటి పెద్ద హీరోల సినిమాల్లో మంచిపాత్రల్లో నటించానన్న సంతృప్తి ఉంది. తమిళంలో ఆరు సినిమాలు, 35 సీరియల్స్‌ చేశాను.

తెలుగులోకి ఇలా..
అప్పట్లో ‘ఈ టీవీ’లో ప్రతి ఆదివారం ఒక ప్రీమియర్‌ మూవీ వచ్చేది. వాటిని సుమన్‌గారు డైరెక్ట్‌ చేసేవారు. ఆ ప్రాజెక్టులో పనిచేసిన పద్మా చౌదరి (ప్రవళిక) నాకు చెన్నైలో మంచి ఫ్రెండ్‌. ఓ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌కోసం నన్ను సజెస్ట్‌ చేసింది. ఆడిషన్‌కి వెళితే సెలెక్ట్‌ చేశారు. ఇంద్రనాగ్‌ హీరోగా వచ్చిన ఆ ప్రీమియర్‌ మూవీద్వారా తెలుగులో కెరీర్‌ మొదలైంది. తర్వాత ‘ఎదురీత’, ‘చంద్రముఖి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా వరుసగా సీరియల్స్‌లో అవకాశాలు లభించాయి. తెలుగులో సినిమా చాన్స్‌లు కూడా వచ్చాయి.
‘నోట్‌బుక్‌’ సినిమాకోసం అడిగారు. కానీ, గ్లామర్‌ రోల్‌ కావడంతో రిజెక్ట్‌ చేశా.

అందుకే..సినిమాలకు దూరం!

దర్శకేంద్రుని మెప్పు..
జీ తెలుగులో వచ్చిన ‘మంగమ్మగారి మనవరాలు’తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సీరియల్‌కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్‌. ఆయన ఓసారి సెట్స్‌కి వచ్చినప్పుడు, అందరి ముందూ ‘చాలా బాగా చేస్తున్నావు. బాగుంది’ అని నన్ను మెచ్చుకున్నారు. అలాగే, తమిళంలో రమ్యకృష్ణగారి బ్యానర్లో ఆమె చెల్లి పాత్రలో నటించా. ఆ సీరియల్‌ చూసి రమ్యకృష్ణగారి నాన్న ఫోన్‌చేసి మరీ ప్రశంసించారు. సౌందర్య అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నటన, ఆహార్యం అంటే ప్రత్యేక అభిమానం. తనే నాకు అన్నివిధాలా ఆదర్శం.

నెగెటివ్‌ పాత్రలు ఇష్టం
ఇప్పటి వరకు నేను చేసిన వాటిలో పాజిటివ్‌ పాత్రలే ఎక్కువ. తెలుగులో బాలాజీ టెలీ ఫిలిమ్స్‌వారి ‘కళ్యాణి’ సీరియల్లో కాస్త నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర చేసినా, పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌ చేయలేదు. నిజానికి నాకు అలాంటి పాత్రలంటేనే ఇష్టం. వాటిలో నటనకు స్కోప్‌ ఉంటుంది. కానీ, ఆ అవకాశం దొరకలేదు. పైగా అన్నీ మంచితనానికి చిరునామా లాంటి పాత్రలే వచ్చాయి. మా టీవీ ‘భార్య’ సీరియల్లో చేసిన పాత్ర చాలా ఎమోషనల్‌. భార్యాభర్తల బంధం, అత్తింటి బాధలు, ఆడపడుచు ఆరళ్ళతో సతమతమయ్యే పాత్ర. ఆ సీరియల్లో ఏడ్చినంతగా మరే సీరియల్లోనూ ఏడవలేదు.

  • ప్రవళిక వేముల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అందుకే..సినిమాలకు దూరం!
అందుకే..సినిమాలకు దూరం!
అందుకే..సినిమాలకు దూరం!

ట్రెండింగ్‌

Advertisement