గురు రాఘవేంద్ర నమోస్తుతే!
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు. అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి. మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే మంత్రాలయంగా మార్చిన గురుదేవుడు. తుంగా జలాల సేవతో.. తులసీదళాల పూజతో.. తనను ఆరాధిస్తున్న వారిని సదా
భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు. అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి. మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే మంత్రాలయంగా మార్చిన గురుదేవుడు. తుంగా జలాల సేవతో.. తులసీదళాల పూజతో.. తనను ఆరాధిస్తున్న వారిని సదా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మంత్రాలయ బృందావనంలో ఎన్నో మహిమలు చూపిన ఆ యతికుల తిలకుడి జయంతి తిథి సందర్భంగా ప్రత్యేక వ్యాసం..
ఈ నెల 9న రాఘవేంద్రస్వామి జయంతి తిథి
మహిమాన్వితం మంత్రాక్షతలు
మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి దర్శనం తర్వాత పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు భక్తులు. రాఘవేంద్రస్వామి పీఠాధిపతిగా ఉన్ననాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. స్వామివారు ఉపయోగించిన పాత్రలోనే ఇప్పటికీ అక్షతలు కలుపుతుండటం విశేషం. ఈ మంత్రాక్షతలను శిరస్సున ధరిస్తే.. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయచ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే॥
సకల ప్రదాత రాఘవేంద్రుడు. ఆయన కరుణా సముద్రుడు. సత్యధర్మాలను ఆశ్రయించిన భక్తులకు కల్పవృక్షంతోనూ, కామధేనువుతోనూ సమంగా వరాలు కురిపిస్తాడు. మనసులో స్వామిని నిలుపుకొన్న వారికి ఐశ్వర్యం, యశస్సును అందిస్తారని రాఘవేంద్ర స్తోత్రం చెబుతుంది.
గురు రాఘవేంద్రుడు మధ్వ సంప్రదాయంలో ప్రభవించినా.. అందరివేల్పు. స్వామి ప్రహ్లాదుడి అంశగా జన్మించాడని విశ్వసిస్తారు. రాఘవేంద్రుల పూర్వాశ్రమ నామం.. వేంకటనాథుడు. తమిళదేశంలోని భువనగిరి జన్మస్థలం. తిమ్మణ్ణభట్టు, గోపాంబ దంపతులకు ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు జన్మించాడు. కాంచీపురంలో వేదాధ్యయనం చేశాడు. వీణావాదనంలోనూ ప్రతిభ కనబరిచేవాడు. వీణవేంకటభట్టుగా పిలిచేవారంతా. శ్రీ సుధీంద్ర తీర్థుల దగ్గర సకల శాస్ర్తాలు అధ్యయనం చేశాడు వేంకటనాథుడు. తన పాండిత్య ప్రతిభతో ఎందరినో ఓడించి మహాభాష్యాచార్య, మహాభట్టాచార్య బిరుదులు పొందాడు. సరస్వతీ కృప అనంతమైనా, లక్ష్మీ కటాక్షం అస్సలు లభించలేదు. దుర్భర దారిద్య్రాన్ని అనుభవించాడు. కన్నబిడ్డకు కాసిన్ని ఆవుపాలు సమకూర్చలేని పరిస్థితి. ఆ ఐహిక కష్టాలను చిరునవ్వుతో తట్టుకొన్నాడు. అంతా హరి చిత్తమని తలచాడు.
వేంకటనాథుడు కారణ జన్ముడని ఆయన గురువు సుధీంద్రతీర్థులు గుర్తించాడు. సన్యాసాశ్రమం స్వీకరించమని ఆదేశించాడు. గుర్వాజ్ఞ ప్రకారం.. ఫాల్గుణ మాసం శుక్ల విదియ నాడు రాఘవేంద్రతీర్థులుగా ఆశ్రమనామాన్ని స్వీకరించాడు వేంకటనాథుడు. నాటినుంచి దేశ సంచారం చేస్తూ.. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రబోధించాడు. అనుభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులకు భాష్యం, రామచరిత మంజరి, కృష్ణచరిత మంజరి వంటి 48 గ్రంథాలను రచించాడు. దాస సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. తమిళనాడులో పుట్టి, కర్ణాటకలో పెరిగి, ఆంధ్రదేశంలో స్థిరపడ్డాడు. హంసనామక పరమాత్మతో ప్రారంభమైన గురుపరంపరలో 32వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆసేతు హిమాచలం మూడుసార్లు కాలినడకన పర్యటించాడు. ఈ క్రమంలో మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతానికి ప్రచారం కల్పించాడు. ‘జీవుడు వేరు, బ్రహ్మ వేరు. జీవుడు మిథ్య కాదు. జడ జగత్తు కూడా మిథ్య కాదు. పరమాత్మ ఎంత సత్యమో, జీవ జగత్తు కూడా అంతే సత్యం’ అన్న పరమ సత్యాన్ని ప్రపంచానికి ప్రబోధించాడు. ‘సర్వోత్తముడైన హరిని ఆశ్రయిస్తే భవ సాగరాన్ని సునాయాసంగా దాటేయవచ్చు. వైకుంఠధామాన్ని చేరుకోవచ్చు’ అని చాటి చెప్పాడు.
గురు రాఘవేంద్రులుగా మంత్రాలయంలో ఆయన చూపిన మహిమలు అనేకం. 1671లో శ్రావణ బహుళ విదియ నాడు సజీవ బృందావన ప్రవేశం చేశాడు. యతిశేఖరుడి బృందావనం ఎన్నో అద్భుతాలకు కేంద్రమైంది. బ్రిటిష్ పాలనలో దత్త మండల కలెక్టరు థామస్ మన్రో.. మంత్రాలయ మఠానికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడు. ఆలయ నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి.. స్వామివారి బృందావన దర్శనానికి తీసుకెళ్లారు. మరుక్షణమే ఓ అద్భుతం జరిగింది. బృందావనం నుంచి సాక్షాత్తూ స్వామివారే వచ్చి.. మన్రోతో అనర్గళంగా ఇంగ్లిష్‌లో సంభాషించారట. చట్టాల లోతులను విశ్లేషించారట. చివర్లో మంత్రాక్షతలూ ఇచ్చారట. తన తప్పిదానికి మన్నించమంటూ మన్రో ఉత్తర్వులను వెనక్కి తీసుకొన్నాడట. ఈ విషయాన్ని అధికారిక గెజిట్లోనూ ప్రకటించారు థామస్ మన్రో. ఇలాంటి అద్భుత గాథలను కథలు కథలుగా చెబుతారు.
రాఘవేంద్రుల బృందావనం కొలువుదీరిన మంత్రాలయం ప్రాంతం మహిమాన్వితమైనది. కృతయుగంలో ప్రహ్లాదుడు యజ్ఞం నిర్వహించిన చోటు అది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా విశ్రమించిన పవిత్ర శిలను బృందావన నిర్మాణానికి ఎంచుకున్నారు. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న మంత్రాలయం మహిమాన్విత క్షేత్రంగా అలరారుతున్నది. మంత్రాలయంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వందలాదిగా శ్రీరాఘవేంద్ర మఠాలు
వెలిశాయి. స్వామివారి జయంతి తిథి సందర్భంగా గురువైభవ ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో స్వామివారి ఆరాధనోత్సవాలూ ఘనంగా నిర్వహిస్తారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

