నల్లని, ఒత్తయిన జుట్టు కావాలని అందరికీ ఉంటుంది. కానీ తినే ఆహారం నుంచి పీల్చేగాలి వరకు ప్రతీది కలుషితం కావడంతో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటున్నది. పాతికేండ్లకే తెల్లజుట్టు పలకరిస్తున్నది. కేశ సంపదను కాపాడుకోవడానికి రకరకాల నూనెలు, మాస్క్‌లు వాడుతున్నారు. అయితే రసాయనాలు కలిసిన సీరమ్‌లు, హెయిర్ డైల కంటే సహజమైన నూనెలు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. సహజ సువాసనలు వెదజల్లే రోజ్మేరీ ఆయిల్ జుట్టు సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.