Ramya Pasupuleti and Siri Hanmanth | రమ్య పసుపులేటి.. బాలనటిగా పరిచయమై, వెండితెర హీరోయిన్గా మారింది. ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో అభిమానులను అలరించింది. సిరి హనుమంతు.. బిగ్‌బాస్ ఐదో సీజన్లో టాప్ ఫైవ్‌లో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. సీరియల్స్, సినిమాల్లో నటించిన సిరి బిగ్‌బాస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఇద్దరూ ‘ఆహా’ వేదికగా ‘బీఎఫ్ఎఫ్’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా రమ్య, సిరి ముచ్చట్లు..
నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. మాకు తెలిసిన ఒక అంకుల్ ద్వారా అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పుడు క్యూట్‌గా ఉండేదాన్ని. దీంతో ‘పంచాక్షరి’లో అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత వందకుపైగా యాడ్స్‌లో నటించాను. ‘గాయం-2’లోనూ చేశాను. మళ్లీ ‘హుషారు’లో చాన్స్ వచ్చింది. కొన్ని సినిమాలతోపాటు హీరో శ్రీకాంత్ నటించిన ‘చదరంగం’ వెబ్ సిరీస్‌లో ఓ పాత్రలో కనిపించాను. అనుకోకుండా వచ్చినా నటననే కెరీర్‌గా ఎంచుకున్నా. పాత్ర పెద్దదా చిన్నదా అని ఆలోచించకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నా.
నేనే కనిపిస్తా..
కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కాసేపు మెరిసినా, పూర్తిస్థాయి ప్రధాన పాత్ర చేస్తున్న మొదటి వెబ్‌సిరీస్ ‘బీఎఫ్ఎఫ్’. ఇందులో నా పాత్ర పేరు ‘తార’. నా వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను బయట ఎలా ఉంటానో, ఈ క్యారెక్టర్లోనూ అలాగే ఉంటాను. అందుకే కథ వినగానే ఓకే చెప్పాను. టీమ్ మొత్తం కూడా చాలా కష్టపడి పనిచేశాం. ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని భావిస్తున్నాం. నాకు చిన్నప్పటినుంచీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే ఇష్టం. అలాంటి పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుంది. చాలెంజింగ్ పాత్రలు చేయడం వల్లే నటనకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కొన్ని సినిమా కథలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన కథలు వింటున్నా.
మాది వైజాగ్. పుట్టి పెరిగిందంతా అక్కడే. ఎంబీఏలో చేరాక ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. చదువు మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ వచ్చేశా. ఓ చానల్లో న్యూస్‌రీడర్‌గా పనిచేశా. తర్వాత సీరియల్స్‌లో అవకాశం వచ్చింది. స్టార్ మా ‘ఉయ్యాల జంపాల’ నా మొదటి సీరియల్. ఆ తర్వాత మరో రెండు మూడు సీరియల్స్‌లో నటించా. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేశా. ఓటీటీ కోసం నటించడం ఇదే మొదటిసారి. హిందీలో వచ్చిన ‘అడల్టింగ్’ అనే వెబ్ సిరీస్‌కు రీమేక్ ఇది. పేరు అలా ఉంది కానీ, ఇందులో ‘అడల్ట్’ కంటెంట్ ఏమీ ఉండదు. నిజానికి ‘అడల్ట్’ అంటే పెద్ద అని అర్థం. వాడుకలో అర్థం మారిపోయింది. ఇద్దరు మెచ్యూర్డ్ గాళ్స్ తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తారన్నది కథ.
యూట్యూబ్ చానల్‌తో..
నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలన్నది నా కోరిక. అందుకే ‘హే సిరి’ పేరున యూట్యూబ్ చానల్ ప్రారంభించా. బిగ్‌బాస్‌కు వెళ్లకముందే ఆరు లక్షల మంది సబ్‌స్ర్కైబర్స్‌ను సంపాదించా. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది లక్షలకు చేరువలో ఉంది. ఇన్‌స్టాలోనూ ఏడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్‌బాస్‌లో పాల్గొనడం, అందులోనూ టాప్ ఫైవ్‌కి వెళ్లడం చాలా సంతోషకరమైన విషయం. ముందునుంచీ అంతే. టైటిల్ గెలవాలని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రేక్షకులు నా అంచనాలకు మించి ప్రేమను అందించారు. వారి సపోర్ట్‌తోనే ఫైనల్స్ వరకూ వెళ్లా. బిగ్‌బాస్ ఓటీటీకి కూడా రమ్మని పిలిచారు. కానీ చేతిలో ఉన్న ప్రాజెక్టుల కారణంగా వెళ్లలేకపోయా. ఏ బాధ్యత అయినా చాలెంజింగ్‌గా ఉంటేనే నాకు ఇష్టం.
– ప్రవళిక వేముల
“ఓటీటీ ప్లాట్ఫామ్లోకి కేరళ ప్రభుత్వం”
Netflix | ఆ బటన్‌తో రోజుకు 195 సంవత్సరాల యూజర్ల టైం ఆదా.. లెక్కలు చెప్పిన నెట్‌ఫ్లిక్స్!”
OTT | 2008లోనే భారత్‌లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో లాభమా? నష్టమా?”