గుండెకెంతో మేలు..గుమ్మడి!

గుమ్మడితో కూర, పులుసు, సూప్ వంటివి చేసుకుంటాం. ఏం వండినా గుమ్మడి రుచికి తిరుగు లేదు. ఇది రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది.
- గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు, విటమిన్-సి గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఎముకల సాంద్రతను దృఢ పరుస్తుంది. గుమ్మడిలోని పోషకాలవల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
- ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ, బీటాకెరొటిన్లు అధికం. ఇవి కంటిచూపునకు స్పష్టతనిస్తాయి. నేత్ర సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడి వంటకాలు తినిపించడం మంచిది.
- తల్లి కావాలనుకుంటున్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. విటమిన్-ఎ శరీరంలో బీటా
- కెరొటిన్గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా చూస్తుంది.
- విటమిన్-సి అందించే కూరగాయల్లో గుమ్మడికూడా ఒకటి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లూ, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
- నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడం వల్ల, ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

