కావలసిన పదార్థాలు
పచ్చి గుమ్మడికాయ ముక్కలు: ఒక కప్పు, పసుపు: అర టీస్పూన్, బెల్లం: చిన్నముక్క, ఉప్పు: తగినంత, పచ్చికొబ్బరి తురుము: అర కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: రెండు, అల్లం: అంగుళం ముక్క, కరివేపాకు: కొద్దిగా, నూనె: ఒక టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర: అర టీస్పూన్, మినుపపప్పు, శెనగపప్పు: ఒక టీస్పూన్, ఇంగువ: చిటికెడు.
తయారీ విధానం
ముందుగా గుమ్మడికాయ ముక్కలను కొద్దిగా ఉప్పు, పసుపు వేసి, కొన్ని నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించాలి. మిక్సీ జార్లో గుమ్మడికాయ ముక్కలు, బెల్లం, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో కొబ్బరి తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినుపపప్పు, శెనగపప్పు, కరివేపాకు వేసి వేగించాలి. చివరగా ఇంగువ విదిలించి, గుమ్మడికాయ మిశ్రమం వేసి కలుపుకొంటే గుమ్మడి పచ్చడి సిద్ధం.