కావలసిన పదార్థాలు: మటన్ లివర్ ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: మూడు, ఎండు కొబ్బరి తురుము: రెండు టేబుల్ స్పూన్లు, పసుపు: పావు టీస్పూన్, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, అల్లం తురుము: ఒక టీస్పూన్, లవంగాలు: నాలుగు, మిరియాలు: పావు టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, ధనియాలు: ఒక టేబుల్ స్పూన్, నూనె: అర కప్పు, కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె లేకుండా ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఒక నిమిషం పాటు వేయించుకుని కొబ్బరి తురుము, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. కడాయిలో నూనెవేసి వేడయ్యాక తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేగాక కడిగి పెట్టుకున్న లివర్ ముక్కలు వేసి బాగా వేయించాలి. పది నిమిషాల పాటు సన్నని మంటమీద వేగించి పసుపు, ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం వేసి మరో ఐదు నిమిషాలు మగ్గించాలి. బాగా ఉడికి నూనె వేరు పడుతుంటే కరివేపాకు, కొత్తిమీర తురుము వేసి దింపుకుంటే మటన్ లివర్ ఫ్రై సిద్ధం.