దాల్ తడ్కా

కావలసిన పదార్థాలు
కందిపప్పు: ఒక కప్పు, టమాట: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, కరివేపాకు: ఒక రెబ్బ, జీలకర్ర, ఆవాలు: అర టీస్పూన్ చొప్పున, పసుపు: అర టీస్పూన్, కారం: ఒకటిన్నర టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
ముందుగా రెండు గంటలపాటు నానబెట్టిన కందిపప్పును మూడు కప్పుల నీళ్లు పోసి, చిటికెడు పసుపువేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె, నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాక తరిగిన టమాట ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక టీస్పూన్ కారం, పసుపు, ఉప్పు, మెదిపి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద చిన్న కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక జీలకర్ర, అర టీస్పూన్ కారం వేసి, బాగా వేగాక గిన్నెలోకి తీసుకున్న పప్పు పైనుంచి వేసుకుంటే దాల్ తడ్కా రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- dal tadka
- tasty food
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

