పోషకాల నేస్తం..పిస్తా!
జీవనశైలి మార్పుల కారణంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్యాలు దాపురిస్తున్నాయి. వ్యాయామంతోపాటు సరైన ఆహారం ద్వారా జీవనశైలి రోగాలను నియంత్రించవచ్చు. ఆ ప్రయత్నంలో పిస్తా.. నేస్తంలా సహకరిస్తుంది.
జీవనశైలి మార్పుల కారణంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్యాలు దాపురిస్తున్నాయి. వ్యాయామంతోపాటు సరైన ఆహారం ద్వారా జీవనశైలి రోగాలను నియంత్రించవచ్చు. ఆ ప్రయత్నంలో పిస్తా.. నేస్తంలా సహకరిస్తుంది.
కేలరీలు తక్కువ: మిగతా పప్పు గింజలతో పోలిస్తే పిస్తాలో కేలరీలు, కొవ్వు శాతం తక్కువ. జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అందువల్ల పిస్తా తిన్నాక పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఇంకేమీ తినాలనిపించదు. దాంతో బరువు పెరిగే సమస్య ఉండదు.
తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్: ఫలానా పదార్థం తిన్న తర్వాత ఎంత వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తుందో చెప్పే సూచిక.. ైగ్లెసిమిక్ ఇండెక్స్. పిస్తాల
ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ. దీనివల్ల గ్లూకోజ్ స్థాయులు ఉన్నట్టుండి పెరిగే ఆస్కారమే లేదు.
అసంతృప్త కొవ్వులు అపారం: పిస్తాలో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికం. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉపకరిస్తాయి. అందుకే పిస్తాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మధుమేహ ప్రమాదాన్ని 27 శాతం వరకూ తగ్గించుకోవచ్చని చెబుతారు నిపుణులు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికం: పిస్తాలో ఫ్లేవనాయిడ్లతో పాటు ల్యూటెన్, జెక్సాంథిన్, బీటా కెరోటిన్లలాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే క్లోమ గ్రంథి పనితీరు దెబ్బతినకుండా ఇవి సాయపడతాయి.
పీచు ఎక్కువ: పిస్తాలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థం కారణంగా ఆహారం జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది. దీనివల్ల శరీరం గ్లూకోజ్‌ను తీసుకునే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా చక్కెర స్థాయి సమతులంగా ఉంటుంది.
గుండెకు మేలు: మధుమేహం లేని వారితో పోలిస్తే ఉన్న వాళ్లలో గుండెజబ్బులు వచ్చే ఆస్కారం అధికం. రక్తంలో కొవ్వు శాతం పెరగకుండా చూస్తుంది పిస్తా.రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

