నిద్ర లయ తప్పకుండా..
మనం జీవించడానికి ఆహారం, నీరు ఎంత అవసరమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. కునుకు తీస్తున్నప్పుడు మాత్రమే మన శరీరంలో అంతర్గతంగా దెబ్బతిన్న కణాలు మరమ్మత్తులకు నోచుకుంటాయి.
మనం జీవించడానికి ఆహారం, నీరు ఎంత అవసరమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. కునుకు తీస్తున్నప్పుడు మాత్రమే మన శరీరంలో అంతర్గతంగా దెబ్బతిన్న కణాలు మరమ్మత్తులకు నోచుకుంటాయి. రోజంతా సేకరించిన సమాచారాన్ని మెదడు ఆ సమయంలోనే క్రమబద్ధీకరిస్తుంది. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే మనం రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటలు… సగటున 8 గంటలపాటు కచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. మన శరీరానికి ఒక అంతర్గత గడియారం ఉంటుంది. దీనినే సిరాడియన్ లయ అంటారు. సాధారణంగా మన శరీరం రాత్రి 11:00 గంటల నుంచి ఉదయం 7:00 గంటల మధ్య నిద్రపోవాలని ఆశిస్తుంది. ఒకవేళ ఈ సమయాన్ని కాదని అర్ధరాత్రి దాటాక ఆలస్యంగా నిద్రపోయి, ఉదయం ఎప్పుడో లేచి 8 గంటల కోటాను పూర్తి చేసినా శరీరానికి నష్టం తప్పదు. ఎందుకంటే బాడీ క్లాక్ మీ నిద్ర గంటలను కాకుండా మీరు ఏ సమయానికి నిద్రపోతున్నారనే అంశాన్ని మాత్రమే లెకిస్తుంది. ఈ లయ తప్పితే శరీరంలోని హార్మోన్లు, ఉష్ణోగ్రత, కణాల మరమ్మతు ప్రక్రియలన్నీ పూర్తిగా నిలిచిపోతాయి.
ఆలస్యంగా నిద్రిస్తే..
- నిరంతరం రాత్రివేళల్లో ఆలస్యంగా పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతిని అధిక రక్తపోటు ప్రమాదానికి దారితీస్తుంది.
- శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వం క్రమంగా తగ్గిపోతుంది. ఇది కొన్నిసార్లు నేరుగా ప్రీడయాబెటిక్ స్థాయులకు దారితీస్తుంది.
- సిరాడియన్ లయ తప్పడం వల్ల మన శరీరంలోని సాధారణ లయబద్ధమైన జన్యువులలో 97 శాతం కంటే ఎకువ అంతరాయం కలుగుతుంది.
- నిద్రపోయే సమయం మారడం వల్ల తీవ్రమైన నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు చుట్టుముడతాయి.
ఈ చిటాలు పాటించండి
ఆరోగ్యకరమైన బాడీ క్లాక్‌ను తిరిగి సొంతం చేసుకోవడానికి వైద్యులు పలు సూచనలు చేస్తుండటం విశేషం. నిద్ర సమయాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి ఉదయం నిద్ర లేచిన 1-2 గంటల్లోపు కనీసం 30 నిమిషాల పాటు ఎండలో గడపడం శక్తిమంతమైన మార్గం. పడుకోవాలని అనుకునే సమయానికి 2-3 గంటల ముందే గదిలోని లైట్ల వెలుతురును తగ్గించుకోవాలి.
- వైద్యుల సలహా మేరకు చిన్న మొత్తంలో మెలటోనిన్ తీసుకోవాలనుకుంటే.. దానిని నిద్రపోయే ముందు కాకుండా, మీ ప్రస్తుత నిద్రవేళకు 1.5 నుంచి 6 గంటల ముందే తీసుకోవాలి.
- ఉదయం నిద్ర లేవడానికి ఒక నిర్దుష్ట సమయాన్ని సెట్ చేసుకుని, దానిని వారాంతాల్లో కూడా కచ్చితంగా పాటించాలి. మీకు రాత్రిపూట అంత త్వరగా నిద్రపట్టకపోతే.. పడుకునే ముందు ఒక మంచి పుస్తకం చదవడం లేదా మెలోడీ సంగీతం వినడం ద్వారా మెదడు నిశ్చలత్వాన్ని పొంది త్వరగా నిద్ర పడుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
TOMCOM | టామ్‌కామ్ టోపీ.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

