October 2 | గాంధీ జయంతి మాత్రమే కాదు.. ఈ రోజుకు మరెన్నో విశేషాలున్నయ్ !!
అక్టోబర్ 2 ( October 2nd )వ తేదీ.. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అని దేశమంతా తెలుసు. కానీ ఈ మహనీయుడి జన్మదినం నాడు మరెన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బాపూజీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకొంటారు.
అక్టోబర్ 2 ( October 2nd )వ తేదీ.. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అని దేశమంతా తెలుసు. కానీ ఈ మహనీయుడి జన్మదినం నాడు మరెన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బాపూజీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకొంటారు. దీనిని 2007 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జాతిపిత జయంతినాడే మచ్చలేని నాయకుడు, కేంద్ర తొలి రైల్వేమంత్రి, రెండో ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి కూడా! ఈ ఇద్దరు మహనీయులు జన్మించిన సంవత్సరాలు వేరైనా తేదీలు ఒకటే కావడం విశేషం.
ఇక స్వాతంత్య్రోద్యమ చరిత్రలో విదేశీ వస్తు బహిష్కరణ కీలక పాత్ర పోషించింది. గాంధీజీ పిలుపు మేరకు భారతీయులు ఖాదీ దుస్తులు ధరించి స్వాతంత్య్ర సంగ్రామానికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహాత్ముడి జయంతిని ‘జాతీయ ఖాదీ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ఇదే రోజును మాదకద్రవ్య వినిమయ వ్యతిరేక దినంగానూ చేసుకుంటారు. అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు దాన్ ఉత్సవ్ (జాయ్ ఆఫ్ గివింగ్) వారంగా పిలుస్తారు. లేనివాళ్లకు తోచినంత దానం చేయడమే ఈ ఉత్సవ సందేశం. దాతృత్వం గొప్పదనాన్ని తెలియజేయాలనే సంకల్పంతో 2009లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read More :
“కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ ముద్రణ ఎప్పుడు మొదలైంది? బోసి నవ్వుల గాంధీ బొమ్మ ఎక్కడిది?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

