ఊహల ఊయలలో.. లాలలూ.. డెలులూ!
ప్రేమికులు తమదైన ఊహల్లో విహరిస్తుంటారు. పెళ్లి, భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటారు. అయితే, నవతరం ప్రేమికులు మాత్రం.. కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. వీరు ఊహల్లోనే ప్రేమించుకుంటున్నారు. ‘డెలులు డేటింగ్' అంటూ.. తమదైన ప్రపంచంలో బతికేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ సరికొత్త డేటింగ్ విపరీతమైన ప్రాచుర్యం పొందింది. డేటింగ్ ప్రపంచంలోనే ‘డెలులు డేటింగ్' సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. ‘డెల్యూజనల్' అనే పదానికి సంక్షిప్త రూపమే ‘డెలులు’.
ప్రేమికులు తమదైన ఊహల్లో విహరిస్తుంటారు. పెళ్లి, భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కంటారు. అయితే,
నవతరం ప్రేమికులు మాత్రం.. కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. వీరు ఊహల్లోనే ప్రేమించుకుంటున్నారు. ‘డెలులు డేటింగ్’ అంటూ.. తమదైన ప్రపంచంలో బతికేస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ సరికొత్త డేటింగ్ విపరీతమైన ప్రాచుర్యం పొందింది. డేటింగ్ ప్రపంచంలోనే ‘డెలులు డేటింగ్’ సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నది. ‘డెల్యూజనల్’ అనే పదానికి సంక్షిప్త రూపమే ‘డెలులు’.
అంటే.. వాస్తవానికి దూరంగా భ్రమల్లో బతకడం. ఈ డెలులు డేటింగ్ కూడా అంతే! భ్రమల్లో ప్రేమించుకోవడం. అంటే, ఒక వ్యక్తిపై ఇష్టం ఉన్నప్పుడు, వారు కూడా మనల్ని ప్రేమిస్తున్నారని, భవిష్యత్తులో వారితో బంధం అద్భుతంగా ఉంటుందని అతిగా ఊహించుకోవడం. దీన్నే ‘డెలులు డేటింగ్’ అంటూ ఫాలో అయిపోతున్నది నవతరం. నిజానికి, ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఇలా ఊహల్లో విహరిస్తుంటారు. దీనివెనక సైన్స్ కూడా ఉన్నది. ప్రేమలో ఉన్నప్పుడు మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ లాంటి ‘ఫీల్ గుడ్’ హార్మోన్లు విడుదలవుతాయి.
ఇవి యువతరానికి ఒక రకమైన మత్తును, అమితమైన ఆనందాన్ని అందిస్తాయి. అందుకే, వారు ఎప్పుడూ ఏదో తెలియని పరధ్యానంలో, తీపి ఊహల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే, ఈ డెలులు డేటింగ్లో మాత్రం.. ఓ పది అడుగులు ముందే ఉంటారు. వీరు వాస్తవ పరిస్థితుల కంటే తమ పాజిటివ్ ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎదుటి వ్యక్తి ఒక్క మెసేజ్ చేసినా.. వారు తన కోసం పడి చచ్చిపోతున్నారని ఊహించుకుంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడినా.. అది ప్రేమకు సంకేతమని నమ్ముతుంటారు. ‘నేను కోరుకున్న వ్యక్తి నాకే దక్కుతారు’ అనే బలమైన నమ్మకంతో ఉంటారు.
అనుకూలం.. సానుకూలం!
- డెలులు డేటింగ్ ద్వారా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి.
ఆత్మవిశ్వాసం: ఎదుటివారు తమను ప్రేమిస్తున్నారని ఊహించుకోవడం వల్ల.. వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో తిరస్కరణ ఎదురైనా.. దాన్ని తట్టుకునే ధైర్యం వస్తుంది.
ప్రేమించే అవకాశం: కావాలనుకున్న వ్యక్తితో ప్రేమగా, మర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇది సానుకూలంగా మారి.. ఎదుటివారిలో నిజంగానే ప్రేమ చిగురించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో
ఆ బంధం మరింత బలపడుతుంది.
ఉత్సాహం: సీరియస్గా ఉండే సాధారణ డేటింగ్ ప్రపంచంలో.. ఈ రకమైన డెలులు డేటింగ్ ఒకరకమైన వినోదాన్ని, మానసిక ఉత్సాహాన్ని అందిస్తుంది.
ప్రతికూలతలూ..
డెలులు డేటింగ్లో కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. ఇందులో పరిమితులు దాటితే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి.
వాస్తవాన్ని విస్మరించడం: ఎదుటి వ్యక్తి పట్టించుకోకపోయినా, తప్పుగా ప్రవర్తించినా.. అది మనకు మంచిదే అని భ్రమపడుతుంటారు. దీనివల్ల భవిష్యత్తులో మోసపోయే అవకాశం ఉంది.
తీవ్రమైన నిరాశ: మనం ఊహించుకున్న దానికి, వాస్తవానికి పొంతన ఉండదు. ఇలాంటి సందర్భాల్లో కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏకపక్ష ప్రేమ: ఈరకమైన డేటింగ్లో ప్రేమ అనేది ఒకరివైపు నుంచే ఉంటుంది. దీనివల్ల అవతలి వ్యక్తికి ఇబ్బంది కలిగించే పరిస్థితులకు కూడా దారితీయవచ్చు.
ఎలా ఫాలో అవ్వాలి?
మీ ఊహలు కేవలం మీ సంతోషం కోసమే ఉండాలి. అవి ఎదుటి వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. అప్పుడప్పుడూ మీ ఊహల ప్రపంచం నుంచి బయటికి వచ్చి.. ఎదుటి వ్యక్తి నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. సంతోషం కోసం మరొకరిపై, ఒక ఊహపై మాత్రమే ఆధారపడకుండా.. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవాలి. చివరిగా.. డెలులు డేటింగ్ అనేది ఒక రకమైన ‘ఆశావాదం’ మాత్రమే! జీవితంలో ప్రతిదీ లెక్కలతో చూస్తే బోర్ కొడుతుంది. అందుకే కొంచెం ఊహల్ని జోడించుకోవడం తప్పు కాదు. అయితే, ఆ ఊహలు మిమ్మల్ని వాస్తవ ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేయకుండా చూసుకోవడమే అసలైన జీవితం!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

