Namma Katte | మహిళలు మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఇదొక మంచి వేదిక
Namma Katte | తమ ఆలోచనలు పంచుకోవడానికి ఎవరికైనా ఒక వేదిక ఉండాలి. కానీ, బెంగళూరులాంటి మహానగరాల్లో సామాన్య మహిళలకు ఆ అవకాశం ఎక్కడ దొరుకుతుంది? లింగరాజపురంలోని ‘నమ్మ కట్టె ( Namma Katte )’ (మా అరుగు) ఆ ఖాళీని భర్తీ చేసింది. చుట్టూ ఎంబ్రాయిడరీ వస్ర్తాలు, మధ్యలో ఒక ఊయలతో.. పుట్టింటిని గుర్తుకుతెస్తుంది ‘నమ్మ కట్టె’. ఇందూ ఆంథోనీ ( Indu Antony ) అనే కళాకారిణి ఆవిష్కరణ ఇది.
ఆ ఆవరణలో ప్రవేశించడానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు. వెళ్లవచ్చు. ఊయల ఊగవచ్చు. పక్కనే ఉన్న పుస్తకాలు చదువుకోవచ్చు. తోటి మహిళలతో మాట్లాడుకోవచ్చు. చర్చించుకోవచ్చు. వాదించుకోవచ్చు. పాడాలనిపిస్తే పాటలూ పాడుకోవచ్చు. సెమినార్లు జరుగుతుంటే పాల్గొనవచ్చు. వర్క్‌షాప్‌లు నడుస్తుంటే.. కొత్త నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఆంథోనీ చాలాకాలంగా అంగన్వాడీలతో కలిసి వర్క్‌షాప్స్ చేస్తున్నారు. వారితో ఆలోచనలు పంచుకునేందుకు అవకాశమే ఉండేది కాదు. చెట్టు కిందో, దుకాణం పక్కనో నిలబడి మాట్లాడుకునేవారు. ఇలా కాకుండా మహిళలు మనసువిప్పి ముచ్చటించుకోవడానికి ఒక సురక్షితమైన స్థలాన్ని సృష్టించాలని భావించిందామె. ఆ ప్రయత్నానికి యూకేలోని వెల్కమ్ ట్రస్ట్ నిధులు సమకూర్చింది. దీంట్లో రోజూ ఏదో ఒక వర్క్‌షాప్ నడుస్తూనే ఉంటుంది. ఎంబ్రాయిడరీ డిజైనింగ్ వంటి ఉపాధి నైపుణ్యాలనూ బోధిస్తున్నారు. మంచి ప్రయత్నమే!
Read More :
Kamathipura Post Office | కామాటిపురలోని సెక్స్ వర్కర్ల జీవితంలో వెలుగు తీసుకొస్తున్న పోస్టాఫీస్”
“వాడని పూలే వ్యాపారం.. అదరగొడుతున్న అక్కాచెల్లెళ్లు”
టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
ఐటీ కొలువులు వదులుకుని కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న మహిళలు.. ఎందుకంటే..”
అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- inspiration
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

