స్తన్యం.. పోషకాల సైన్యం
శాస్త్రజ్ఞులు ఎంతో కృషిచేస్తున్నా తల్లిపాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకపోతున్నారు. శిశువు శారీరక, మానసిక అవసరాలను తల్లిపాలు మాత్రమే పూర్తిగా తీర్చ గలవు. రక్షిత మంచినీటి సరఫరా లేని చోట, అపరిశుభ్రమైన పరిసరాలలో శిశు ఆరోగ్య సంరక్షణకు తల్లిపాలు మరీ మరీ ముఖ్యం
శాస్త్రజ్ఞులు ఎంతో కృషిచేస్తున్నా తల్లిపాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేకపోతున్నారు. శిశువు శారీరక, మానసిక అవసరాలను తల్లిపాలు మాత్రమే పూర్తిగా తీర్చ గలవు. రక్షిత మంచినీటి సరఫరా లేని చోట, అపరిశుభ్రమైన పరిసరాలలో శిశు ఆరోగ్య సంరక్షణకు తల్లిపాలు మరీ మరీ ముఖ్యం.
తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వకపోవడానికి అనేక కారణాలు. పిల్లలకు పాలు తాగించాలని ఉన్నా, కొన్ని కారణాలతో, అపోహలతో వెనకడుగు వేస్తున్నారు.
- పారిశ్రామికీకరణ, పట్టణ జీవితం, ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రసవం తరువాత సాధ్యమైనంత త్వరగా పనికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకొంటున్నారు. పని ప్రాంతాలలో కూడా కనీస సౌకర్యాలు ఉండటం లేదు. దీనివల్ల శిశువులకు తమ జన్మహక్కు అయిన స్తన్యం లభించడం లేదు.
- ఆధునిక జీవితంలో కుటుంబం అంటే.. భార్యాభర్తలే. ఇలాంటి జీవన సరళిలో మొదటిసారిగా ప్రసవించిన వారికి ఎదురయ్యే వివిధ సమస్యలకు సరైన సలహాలిచ్చే పెద్దలెవరూ అందుబాటులో ఉండటం లేదు.
- పాలు తాగించే స్త్రీలలో ఏదో ఒక సందర్భంలో ‘బిడ్డకు పాలు సరిపోతున్నాయా, లేదా?’ అనే అనుమానం వస్తుంది. తమకు తామే పాలు సరిపోవడం లేదనే నిర్ణయా నికొచ్చి.. పై పాలు ఇస్తుంటారు. పాలు సరిపోకపోవడం అన్నది ఒక పెద్ద అపోహ. ఈ ఆలోచన రావడం ప్రారంభ మైతే మానసిక కారణాల వల్ల క్రమేణా పాలు తగ్గిపోతాయి.
- చనుమొనల నొప్పి.
- పాపాయి పాలు తాగకపోవడం.
- ఆకర్షణీయమైన అబద్ధపు ప్రకటనలు కూడా ఓ కారణమే. పై పాలు తాగిస్తున్న తల్లీ, తాగుతున్న శిశువూ.. ఎంతో ఆనందంగా ఉన్నట్లు టెలివిజన్‌లో, పత్రికలలో ప్రకటనలు గుప్పిస్తుంటారు. పాలసీసా కొనేవారికి ఒక హెచ్చరిక. పై పాలతో కలిగే అనారోగ్యాలు అనేకం.
- బక్కపలచగా ఉన్నాను. నా పాలు చిక్కగా ఉండకపోవచ్చు! స్తనాలు చిన్నవిగా ఉన్నాయి. నేను పాలు ఇవ్వగలనా?.. అనే సందేహాలు తరచుగా వస్తుంటాయి. బక్కగా ఉన్నవారే కాదు, కొంతమేరకు ఆహార లోపాలు ఉన్నవారు కూడా అందరు మాతృమూర్తుల మాదిరిగానే పాలు ఇవ్వగలరు.
- పాలు తాగించడం వల్ల స్తన స్వరూపం చెడిపోతుందనుకుంటారు. నిజానికి, స్తనాల ఆకృతి మారిపోవడానికి కారణం.. గర్భధారణ సమయంలో శరీరంలో జరిగిన వివిధ మార్పులే అని గ్రహించాలి.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Breast
- Health
- Infants
- Mother milk
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

