40 లోనే మెనోపాజ్.. కారణాలివేనా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
మెనోపాజ్...మహిళల జీవక్రియలో కీలకఘట్టం. ఇది స్త్రీలలో పునరుత్పత్తి శక్తి ఆగిపోతుందని సూచించే సంకేతం. మెనోపాజ్‌కు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో తలెత్తే సమస్యలను అధిగమించవచ్చు. సాధారణంగా 50 ఏండ్లు దాటిన తరువాత మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కానీ, జీవనశైలి మార్పుల కారణంగా నలభైలలోనే మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకరం
మెనోపాజ్…మహిళల జీవక్రియలో కీలకఘట్టం. ఇది స్త్రీలలో పునరుత్పత్తి శక్తి ఆగిపోతుందని సూచించే సంకేతం. మెనోపాజ్‌కు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో తలెత్తే సమస్యలను అధిగమించవచ్చు. సాధారణంగా 50 ఏండ్లు దాటిన తరువాత మెనోపాజ్ దశకు చేరుకుంటారు. కానీ, జీవనశైలి మార్పుల కారణంగా నలభైలలోనే మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకరం. దీంతో మహిళలు నడి వయసులోకి ప్రవేశించక ముందే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. అక్టోబర్ 18 ‘ప్రపంచ మెనోపాజ్ డే’ సందర్భంగా ముందస్తు మెనోపాజ్‌కు కారణాలు, దానివల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స గురించి తెలుసుకుందాం.
నేడు ప్రపంచ మెనోపాజ్ డే

సాధారణంగా ఆడశిశువు పుట్టుకతోనే 12 లక్షల నుంచి 20లక్షల అండాలతో జన్మిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఆడపిల్ల రజస్వల అయ్యి, రుతుక్రమం మొదలయ్యే సమయానికి సుమారు 400 నుంచి 500 అండాలు మాత్రమే మిగులుతాయి. రుతుక్రమం సమయంలో ప్రతీ నెల కొన్ని అండాలు విడుదలవుతూ వాటి నిల్వ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా అండాశయంలోని అండాలు పూర్తిగా అయిపోయే దశనే మెనోపాజ్‌గా పేర్కొంటారు. మెనోపాజ్ దశకు చేరుకునే సరికి అండాల విడుదలతో పాటు హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది. మెనోపాజ్ అనేది స్త్రీలో పునరుత్పత్తి నిలిచిపోవడానికి సంకేతం.
ముందు జరిగే మార్పులు మెనోపాజ్ ఒక్కసారిగా తలెత్తే పరిస్థితి కాదు. మెనోపాజ్‌కు 5 నుంచి 7 సంవత్సరాల ముందే శరీరంలో కొన్ని మార్పులు మొదలవుతాయి. వాటిలో ముఖ్యంగా హార్మోన్ల స్థాయి క్రమంగా తగ్గుతుంది. పీయూష గ్రంథి నుంచి గొనడోట్రోపిన్ వంటి హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. ఫలితంగా శారీరక మార్పులు జరిగి మెనోపాజ్ దశకు చేరుకుంటారు. ఈ ప్రక్రియలన్నీ 47 53 ఏండ్ల మధ్య సంభవిస్తాయి. అంటే మెనోపాజ్ రావడానికి సగటు వయసు 51సంవత్సరాలు. కొంతమందిలో కొంచెం ఆలస్యంగా కూడా రావచ్చు. కానీ, ప్రస్తుతం 45లోపే మెనోపాజ్ దశకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకొంత మందిలో అయితే 40లోపే ఈ మార్పు కనిపిస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. దానిని ‘ప్రిమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు.
ముందస్తు మెనోపాజ్‌కు కారణాలు…
- వంశపారంపర్యం
- జన్యులోపం
- ఫర్టిలిటీ చికిత్స
- జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం
- తగినంత వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం
- బరువు పెరగడం
- ధూమపానం
- మాదకద్రవ్యాల వినియోగం
లక్షణాలు
- క్యాల్షియం తగ్గిపోవడం
- నెలసరి క్రమం తప్పడం
- రెండు మూడు నెలలకు ఒకసారి నెలసరి
- తీవ్ర రక్తస్రావం లేదా అతి తక్కువ రక్తస్రావం
- మానసిక ఒత్తిడి పెరగడం
- అసహనం, చికాకు
- కీళ్లనొప్పులు
- నీరసం, అలసట
- తల, మెడ, ఛాతీ దగ్గర చర్మం ఎర్రగా మారడం
- చెమటలు ఎక్కువగా పట్టడం
- జుట్టు రాలడం
సమస్యలు
- ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోవడం
- విటమిన్ ‘డి’ తగ్గడం
- బీపీ, కొలెస్ట్రాల్ పెరగడం
- మానసిక ఒత్తిడి, నిద్రలేమి
- హాట్ ఫ్లాషెస్ (వేడిగా ఉండి చెమటలు పట్టడం)
- ఎముకలు బలహీనమై ఆస్టియోపోరోసిస్ ఏర్పడటం
- ఫ్రాక్చర్ టెండెన్సీ అధికంగా ఉండటం
- మూత్ర వ్యవస్థ, జననేంద్రియాలపై ప్రభావం
- యోని, మూత్రనాళం, మూత్రకోశాల్లో ఈస్ట్రోజెన్ తగ్గుదల
- మూత్రనాళ ఇన్ఫెక్షన్లు
- కలయిక సమయంలో నొప్పి, మంట
- గుండెపోటు ముప్పు పెరుగుతుంది
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
35 ఏండ్లు దాటినవారు మమోగ్రామ్, పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. తరచుగా లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. మెనోపాజ్ వచ్చిన తరువాత ప్రతి 5 ఏండ్లకోసారి ఎముకల సాంద్రత పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆహార నియమాల విషయానికి వస్తే… మెనోపాజ్ దశలో సోయాబీన్స్ ఉత్పత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. టమాట, గుమ్మడి, క్యారెట్, బొప్పాయిలో క్యాన్సర్ నిరోధక మూలకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే అవిసెలు, చేపలు తరచూ తీసుకోవాలి. ఫైబర్, ప్రొటీన్స్ కలిగిన పదార్థాలను అధికంగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు వీలైనంత మేర తగ్గించాలి. ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేషన్‌తో మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు. తగినంత శారీరక శ్రమ ఉండాలి. పజిల్స్, సుడోకు లాంటివాటితో మెదడుకు పని కల్పించాలి. ఒంటరిగా ఉండకుండా నలుగురిలో గడపాలి.
మెనోపాజ్ సమస్యలకు చికిత్స
మెనోపాజ్ తరువాత ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు లక్షణాల తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. దీనితోపాటు క్యాల్షియం, హార్మోనల్ సప్లిమెంట్లు, విటమిన్-డి, మల్టీవిటమిన్స్ ఇస్తారు. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్ కూడా తీసుకోవాలి.
40లోపు అనర్థాలు

- బీపీ, షుగర్ స్థాయులు పెరుగుతాయి
- ఊబకాయం
- మానసిక ఒత్తిడి
- నిద్రలేమి
- రోజువారీ పనులకు ఆటంకం
– డాక్టర్ కె.శిల్పిరెడ్డి
అబ్‌స్టెట్రీషియన్, గైనకాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్
కిమ్స్ కడల్స్, మదర్ అండ్ చైల్డ్ సెంటర్
కొండాపూర్, హైదరాబాద్
– మహేశ్వర్‌రావు బండారి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

