వదిన హత్యకు సుపారీ
మా రెండో అన్నయ్యకు రెండేండ్ల క్రితం పెండ్లయింది. పెద్దలు కుదిర్చిన వివాహం. చాలా వైభవంగా జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఈ మధ్య మా రెండో వదిన అన్నయ్యను హింసిస్తున్నది. ప్రతి విషయంలోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నది. నలుగురిలో హేళన చేస్తున్నది. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నది. తరచూ కొడుతున్నది కూడా. ఈ విషయాలన్నీ తన మనసులోనే దాచుకున్నాడు అన్నయ్య. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎవరితోనో ఫోన్లో చెబుతుంటే గమనించాను. ఆ మాటలు వినగానే నాకు ముచ్చెమటలు పట్టాయి. తన భార్యను హత్య చేయడానికి రౌడీలతో అన్నయ్య సుపారీ కుదుర్చుకుంటున్నట్టు నాకు అర్థమైంది
నా వయసు ఇరవై అయిదు. ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. ఈ మధ్యే నాకు పెండ్లి నిశ్చయమైంది. అందరం కలిసే ఉంటాం. అయితే, మా రెండో అన్నయ్యకు రెండేండ్ల క్రితం పెండ్లయింది. పెద్దలు కుదిర్చిన వివాహం. చాలా వైభవంగా జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా.. ఈ మధ్య మా రెండో వదిన అన్నయ్యను హింసిస్తున్నది. ప్రతి విషయంలోనూ ఆధిపత్యం చెలాయిస్తున్నది. నలుగురిలో హేళన చేస్తున్నది. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నది. తరచూ కొడుతున్నది కూడా. ఈ విషయాలన్నీ తన మనసులోనే దాచుకున్నాడు అన్నయ్య. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎవరితోనో ఫోన్లో చెబుతుంటే గమనించాను. ఆ మాటలు వినగానే నాకు ముచ్చెమటలు పట్టాయి. తన భార్యను హత్య చేయడానికి రౌడీలతో అన్నయ్య సుపారీ కుదుర్చుకుంటున్నట్టు నాకు అర్థమైంది. ఏం చేయాలో తెలియడం లేదు. మీరే తగిన సలహా ఇవ్వగలరు.
– ఓ సోదరి
మీరు వెంటనే మీ అన్నయ్యతో మాట్లాడండి. భార్యను చంపాలనుకోవడం తెలివితక్కువ పని అనే విషయం అర్థమయ్యేలా చెప్పండి. తను చేసినా, మరెవరితోనైనా చేయించినా.. నేరం నేరమే. పోలీసులకు పట్టుబడటం ఖాయం. ఒక్కోసారి చేసిన నేరం నుంచి బయట పడటానికి మరిన్ని తప్పులు చెయ్యాల్సి వస్తుంది. హత్య జరిగితే.. మొదటగా అనుమానించేది మీ అన్నయ్యనే. పట్టుబడిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా వివరించండి. త్వరలోనే మీరూ పెండ్లి చేసుకోబోతున్నారు. ఆ ప్రభావం మీ పెండ్లిమీద, కుటుంబం మీద పడుతుందని మర్చిపోవద్దు. భార్య అంతలా హింసిస్తుంటే.. ఆమె నుంచి విడిపోవడమే ఉత్తమ మార్గం. మంచి లాయర్‌ను నియమించుకోండి.
సాక్ష్యం కోసం మీ అన్నయ్యకు తగిలిన దెబ్బలను ఫొటోలు, వీడియోలు తీసి భద్రపరచండి. అవసరమైతే పోలీసు కేసు పెట్టండి. పక్కాగా ఆధారాలు సమర్పించండి. అంతేకానీ హత్యల వరకూ వెళ్లొద్దని చెప్పండి. మీవైపు న్యాయం ఉంటే.. న్యాయస్థానం మీ వాదనను సమర్థించి విడాకులు మంజూరు చేస్తుంది. న్యాయబద్ధంగానే విడిపోతే.. ఇద్దరికీ ఇబ్బంది ఉండదు. మీరూ సంతోషంగా ఉండొచ్చు. ఆలస్యం చేస్తే.. మరిన్ని దారుణాలు జరిగే ప్రమాదం ఉంది. వెంటనే జాగ్రత్తపడండి. క్షణికావేశం వల్లనో, సినిమాలూ టీవీ సీరియళ్ల ప్రభావంతోనో చాలామంది ఇలాంటి తప్పులు చేస్తారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

