లాక్టోజ్ ఇన్టాలరెన్స్! కొంతమందికి పాలు సరిపడవు.. ఎందుకంటే?
పాలు సంపూర్ణాహారం. తల్లికి పాలు పడకపోతే.. పిల్లలకు ఆవు లేదా గేదె పాలు ఇచ్చి పెంచుతారు. సాధారణంగా అందరికీ సరిపడే పాలు.. కొంతమందికి మాత్రం సరిపడవు. పాలలోని చక్కెర వారి ఒంటికి సరిపడక పోవడంతో కడుపు ఉబ్బరం, నీళ్ల విరేచనాలు వంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని ‘లాక్టోజ్ ఇన్టాలరెన్స్' అంటారు. ఈ సమస్యపై అవగాహన కల్పించే కథనమిది. సాధారణంగా మనందరి చిన్నపేగుల్లో ‘లాక్టేజ్' అనే ఎంజైమ్స్ విడుదలవుతాయి.
పాలు సంపూర్ణాహారం. తల్లికి పాలు పడకపోతే.. పిల్లలకు ఆవు లేదా గేదె పాలు ఇచ్చి పెంచుతారు. సాధారణంగా అందరికీ సరిపడే పాలు.. కొంతమందికి మాత్రం సరిపడవు. పాలలోని చక్కెర వారి ఒంటికి సరిపడక పోవడంతో కడుపు ఉబ్బరం, నీళ్ల విరేచనాలు వంటి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని ‘లాక్టోజ్ ఇన్టాలరెన్స్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కల్పించే కథనమిది. సాధారణంగా మనందరి చిన్నపేగుల్లో ‘లాక్టేజ్’ అనే ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఇవి పాలలో ఉండే లాక్టోజ్ అనే చక్కెరను జీర్ణం చేస్తాయి. కొందరిలో ఈ ఎంజైమ్ ఉత్పాదన చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో ‘లాక్టోజ్ ఇన్టాలరెన్స్’ అనే సమస్య కనిపిస్తుంది. ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్.. పాలలోని చక్కెరను గ్లూకోజ్, గలాక్టోజ్ అనే రెండు పదార్థాలుగా మారుస్తుంది. ఇవి చాలా తేలిగ్గా చిన్నపేగుల్లోకి ఇంకిపోయి.. అక్కడి నుంచి రక్తప్రవాహంలో కలిసి దేహానికి శక్తిని అందిస్తాయి. ఒకవేళ ఈ లాక్టేజ్ చాలా చాలా తక్కువగా ఉంటే.. పాలలోని చక్కెర అయిన లాక్టోజ్ చిన్నపేగుల ప్రాంతంలో రక్తంలో ఇంకిపోకుండా పెద్దపేగుల్లోకి ప్రవేశిస్తుంది. జీర్ణం కాని ఆహారంగా అక్కడికి చేరుకున్న ఆ చక్కెర పదార్థాల్లో బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతుంది. దాంతో కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు కనిపిస్తాయి.
ఇందులో రకాలు లాక్టోజ్ ఇన్టాలరెన్స్లో మూడు రకాలు. అవి..
ప్రైమరీ లాక్టోజ్ ఇన్టాలరెన్స్ : చిన్నప్పుడు పాలు పట్టే సమయంలో ఉత్పత్తి అయ్యే లాక్టేజ్ మోతాదు.. శిశువుల్లో పాలు మాన్పించాక అకస్మాత్తుగా బాగా తగ్గిపోతుంది. దాంతో వాళ్లు పెరిగి పెద్దయ్యాక పాలు, పాల ఉత్పాదనల్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేరు.
సెకండరీ లాక్టోజ్ ఇన్టాలరెన్స్ : ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి తగ్గాక.. ఒకవేళ చిన్నపేగుల్లో లాక్టేట్ ఉత్పాదన తగ్గిపోవచ్చు. ఇక మరికొందరిలో ఏదైనా సమస్య వచ్చి, చిన్నపేగుల ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగినప్పుడు కూడా ఇదే జరగవచ్చు. ఇలా వచ్చిన సమస్యను ‘సెకండరీ లాక్టోజ్ ఇన్టాలరెన్స్’ అంటారు. ఇలా జరిగినప్పుడు కనిపించే లాక్టోజ్ ఇన్టాలరెన్స్ వల్ల పేగుల్లో బ్యాక్టీరియా విపరీతంగా పెరగడం, సీలియాక్ డిసీజ్, క్రోన్స్ డిసీజ్ వంటి జబ్బులకు దారితీయవచ్చు.
కంజెనిటల్/ డెవలప్మెంటల్ లాక్టోజ్ ఇన్టాలరెన్స్ : కొందరు చిన్నపిల్లల్లో స్వతహాగానే పుట్టినప్పటి నుంచి లాక్టేజ్ ఎంజైమ్ సరిగా ఉత్పాదన కాదు. ఇలాంటి పిల్లల్లో పసితనం నుంచే లాక్టోజ్ ఇన్టాలరెన్స్ సమస్య వస్తుంది.
లక్షణాలు : ఈ సమస్యతో బాధపడేవారిలో పాలు తాగిన 30 నిమిషాల నుంచి రెండు గంటల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కేవలం పాలు మాత్రమే కాదు.. లాక్టోజ్ ఉన్న ఇతర ఆహారాలు తీసుకున్నా కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అవి..
నీళ్ల విరేచనాలు (డయేరియా)
వికారం/ వాంతులు
కడుపు కండరాలు పట్టేయడం (స్టమక్ క్రాంప్స్)
కడుపులో గ్యాస్ నిండటం
చికిత్స : సాధారణంగా ఈ సమస్య వల్ల కలిగే ఇబ్బంది కొంతసేపటి తర్వాత దానంతట అదే సద్దుమణిగి పోవచ్చు. కొంతమందిలో మాత్రం దీనివల్ల కలిగే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే చికిత్స కోసం ఏ సమస్య కారణంగా ఇది వచ్చిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆ సమస్య తాలూకు అసలు కారణానికి (అండర్లయింగ్ కాజ్కు) పూర్తి చికిత్స చేసినప్పుడు ఈ సమస్య కూడా తగ్గిపోవచ్చు.
డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే..
ముందుగా చెప్పినట్లు సమస్య తీవ్రత తక్కువగా ఉన్నవారిలో ఇది దానంతట అదే తగ్గుతుంది. అలా కాకుండా పాలతో మాత్రమే కాకుండా ఇతర పాల ఉత్పాదనలు (డెయిరీ ప్రొడక్ట్స్) తీసుకున్నప్పుడు సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే.. డాక్టర్‌ను తప్పక సంప్రదించాల్సి ఉంటుంది.
డా॥ సురేందర్ రావు
కన్సల్టెంట్, నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, సికింద్రాబాద్.
ఫోన్: 8882 046 046
www.rainbowhospital.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

