HomeZindagiIrritable Bowel Syndrome Symptoms And Treatment
పొట్ట ఉబ్బరం బెట్టు చేస్తుంటే ఇలా చేయండి అంతా సర్దుకుంటుంది
కడుపు ఉబ్బరం చాలామందిని ఇబ్బందిపెట్టే విషయమే. కొన్నిసార్లు పొట్ట మాత్రమే కాదు ముఖం, కాళ్లూ చేతులూ కూడా ఉబ్బినట్టు అవుతాయి. ఉబ్బరం వల్ల కడుపులో మందంగా అనిపించడం, నొప్పి, మలబద్ధకం తదితర సమస్యలూ ఎదురవుతాయి. దీన్ని తప్పించుకోవాలంటే..
కడుపు ఉబ్బరం చాలామందిని ఇబ్బందిపెట్టే విషయమే. కొన్నిసార్లు పొట్ట మాత్రమే కాదు ముఖం, కాళ్లూ చేతులూ కూడా ఉబ్బినట్టు అవుతాయి. ఉబ్బరం వల్ల కడుపులో మందంగా అనిపించడం, నొప్పి, మలబద్ధకం తదితర సమస్యలూ ఎదురవుతాయి. దీన్ని తప్పించుకోవాలంటే..
బాగా నమలకుండా తిన్నప్పుడు ఆహారంతో పాటు గాలి కూడా పొట్టలోకి ప్రవేశిస్తుంది. నమిలి తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేం. ఇలా చేయడం ద్వారా ఉబ్బరాన్ని అరికట్టవచ్చు.
పాల పదార్థాలు ఓపట్టాన అరగవు. ఉబ్బరం సమస్య ఉన్నవాళ్లు వీటిని తగ్గించుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది.
టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీళ్లలో కలిపి పరగడుపున తాగితే కడుపులోని విష వ్యర్థాలు, ఆమ్లాలు, ఉప్పు లాంటివి కొట్టుకుపోతాయి. అలాగే గ్రీన్‌టీ లేదా తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల కూడా ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు.
ఎనర్జీ డ్రింక్‌లు, ప్రొటీన్ బార్లలో చక్కెరలు తక్కువే అయినా ప్రిజర్వేటివ్స్, ఉప్పులాంటివి అధిక మోతాదులో ఉంటాయి. ఉబ్బరం సమస్య ఉన్నవారు వీటిని దూరం పెట్ట్టడం మేలు.
కడుపు మరీ ఉబ్బరంగా అనిపిస్తే సోడియం బై కార్బొనేట్ మాత్రలు వేసుకోవచ్చు. అయితే మోతాదుకు మించితే ప్రాణాంతకం.
మన శరీరంలో నీటి నిల్వలు అధికంగా ఉన్నా, మనం ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నా ముఖం, కాళ్లూ చేతులూ ఉబ్బే ప్రమాదం ఉంది. తక్షణ ఉపశమనం కోసం చన్నీటి స్నానం చేయండి. లేదంటే ముఖాన్ని ఐస్‌తో రుద్దుకోండి. చేతులు, కాళ్లు కొంతసేపు చన్నీళ్లలో ఉంచడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి ఉబ్బరం తగ్గుతుంది.
మనం ప్రతి వంటలోనూ విరివిగా ఉప్పు వాడతాం. కానీ ఉప్పు దీర్ఘకాలంలో ముప్పు తెస్తుంది. ఉబ్బరానికి కారణమైన పదార్థాల్లో లవణం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తప్పించు కోవచ్చు.