వ్యాక్సినేషన్‌కు వెళ్లే ముందు..

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా మన దేశం కరోనా ఊబినుంచి బయట పడుతుంది. ఈ మహాయజ్ఞంలో ప్రతి నిమిషం విలువైందే. మన కారణంగా ఓ ఐదు నిమిషాలు ఆలస్యమైందంటే, పరోక్షంగా ఒకరికి టీకా సకాలంలో అందనట్టే. కాబట్టి, తగిన ఏర్పాట్లతో టీకా కేంద్రానికి వెళ్లండి.
- అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ ప్రామాణికమైనవే. అయినా, ఫలానా వ్యాక్సినే కావాలనుకుంటే, ముందే నిర్ధారించుకొని వెళ్లండి. వెళ్లిన తర్వాత గొడవలొద్దు.
- వదులైన బట్టలే వేసుకోండి. మగవారు టీషర్ట్, మహిళలు చుడీదార్ లాంటివి వేసుకోవచ్చు. దీనివల్ల టీకా వేయడానికి అనువుగా ఉంటుంది.
- ఎన్-95 కానీ, సర్జికల్ మాస్క్‌పైన మరొక మాస్కు ధరించి కానీ వెళ్లండి.
- ఖాళీ కడుపుతో వెళ్లకండి.
- వెంట ఓ నీళ్ల సీసా, శానిటైజర్ తీసుకెళ్లండి.
- ఆధార్ గుర్తింపు పత్రమూ తప్పనిసరి.
- అవసరమైతే కొన్ని ఫారాలు పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి, పెన్నుకూడా తీసుకెళ్లండి.
- సాంకేతిక కారణాలవల్ల ఆన్లైన్ చెల్లింపు ఆగిపోయిన పక్షంలో, నగదు అవసరం కావచ్చు.
- కొన్నిసార్లు టీకా ప్రక్రియ ఆలస్యం కావచ్చు. ఓపికతో వ్యవహరించండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

