ఆ లోపంతో మానసికంగా కూడా కుంగిపోతారంట!!
Infertility | పిల్లలు కలగక పోవడానికి అనేక కారణాలు. ఆ లోటు భవిష్యత్తులో మానసిక ఇబ్బందులకూ దారితీస్తుంది. పెండ్లయి ఏండ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని జంటలు మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
Infertility | పిల్లలు కలగక పోవడానికి అనేక కారణాలు. ఆ లోటు భవిష్యత్తులో మానసిక ఇబ్బందులకూ దారితీస్తుంది. పెండ్లయి ఏండ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టని జంటలు మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
ఎలాంటి గర్భ నిరోధక విధానాలు పాటించకుండా.. ఏడాదిపాటు దాంపత్య జీవితం గడిపినా పిల్లలు కలగకపోవడాన్ని సంతానలేమిగా పరిగణిస్తారు. విశ్వవ్యాప్తంగా పది నుంచి పదిహేను శాతం జనాభా ఈ సమస్యతో బాధపడుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో సంతానలేమి ఐదో స్థానంలో ఉంది. భారతదేశంలో వంధ్యత్వం బారిన పడిన జంటలు దాదాపు రెండు కోట్లు. వీళ్ల మానసిక స్థితిపై సంతాన లేమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదని నిపుణులు గుర్తించారు.
సామాజిక సమస్యలు
పెండ్లయిన కొద్ది నెలల నుంచే ప్రతి జంటకూ ఎదురయ్యే ప్రశ్న.. ‘శుభవార్త ఎప్పుడు చెబుతారు?’. ‘ఇప్పుడే వద్దనుకుంటున్నాం..’ అంటూ కొద్దికాలం దాటవేసినా కాలం గడిచేకొద్దీ ఈ తరహా ప్రశ్నలు దంపతుల్లో మానసిక ఆందోళనకు దారితీస్తాయి. నలుగురిలో కలవలేకపోవడం, ఏదో కోల్పోయినట్లు అనిపించడం, అసూయ, ఆత్మన్యూనత మొదలైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నెమ్మదిగా నిరాశలో కూరుకుపోతారు.
ఒత్తిడి ప్రభావం
సంతానలేమి వల్ల ఒత్తిడి, తీవ్ర విచారం, బాధ కుంగదీస్తాయి. దీనివల్ల ఎక్కువ మోతాదులో విడుదలయ్యే ప్రొలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్లు అండాల విడుదలను, సంతాన సాఫల్యాన్ని నెగెటివ్‌గా ప్రభావితం చేస్తాయి.
ఆర్థిక పరిమితులు
సంతాన సాఫల్య చికిత్సలు చాలా ఖరీదైనవి. దీంతో మధ్య తరగతి దంపతులు అప్పులపాలు అవుతారు. అయినా, సరైన ఫలితాలు కనిపించకపోతే డిప్రెషన్‌కు లోనవుతారు. దీర్ఘకాలం కొనసాగే ఆ ఒత్తిడి శరీరాన్ని చికిత్సలకు సహకరించకుండా చేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీదా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అందుకే పిల్లలు కలగని దంపతులు.. మానసిక సమస్యలు ఎదురైనప్పుడు కౌన్సెలింగ్‌కు వెళ్లటం ఉత్తమం. నిర్లక్ష్యం చేస్తే.. ఆలూమగల అనుబంధాలకు బీటలుపడతాయి. పరిస్థితి విడాకులకూ దారితీయవచ్చు.
Read More :
“థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Health
- Infertility
- IVF
- pregnancy
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

