ఆటలో అరటిపండు కావొద్దంటే
వంధ్యత్వం.. ప్రస్తుతం చాలామంది దంపతులను వేధిస్తున్న సమస్య. వివాహమైన ప్రతి 10 జంటల్లో రెండు నుంచి మూడు జంటలు సంతాన లేమితో బాధపడుతున్నాయి. సంతాన లేమి అనేది మహిళల సమస్య మాత్రమే కాదు. దంపతులిద్దరికీ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి. ఇటీవలి కాలంలో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నది.
- దెబ్బతింటున్న లైంగిక ఆరోగ్యం
- సకాలంలో చికిత్సతోనే ఫలితం
వంధ్యత్వం.. ప్రస్తుతం చాలామంది దంపతులను వేధిస్తున్న సమస్య. వివాహమైన ప్రతి 10 జంటల్లో రెండు నుంచి మూడు జంటలు సంతాన లేమితో బాధపడుతున్నాయి. సంతాన లేమి అనేది మహిళల సమస్య మాత్రమే కాదు. దంపతులిద్దరికీ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి. ఇటీవలి కాలంలో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టు కొస్తున్న ఐవీఎఫ్ సెంటర్లే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే దంపతుల్లో సంతాన లేమి సమస్యకు మహిళలే కాదు, పురుషుల పాత్ర కూడా 50 శాతం ఉంది. వారిలో ఉన్న లోపాలు కూడా సంతానలేమికి కారణంగా కనిపిస్తున్నది.
ఒకప్పుడు పురుషుల్లో సంతానలేమి, అంగస్తంభన, టెస్టోస్టిరాన్ హార్మోన్ల లోపం వంటి సమస్యలు ప్రధానంగా 45-50 ఏండ్ల తర్వాతే కనిపించేవి. మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి కారణాల వల్ల 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలోనూ ఈ సమస్యలు పెరుగుతున్నాయి. గతంలో సంతానం కలగకపోతే మహిళల్లోనే లోపాలు వెతికేవారు. కానీ, ప్రస్తుతం శాస్త్రీయ పరిశోధనల ప్రకారం సంతానలేమితో బాధపడుతున్న దంపతుల కేసుల్లో 50 శాతం వరకు.. పురుషుల్లో ఉన్న కొన్ని రకాల అనారోగ్య సమస్యలే కారణంగా తెలుస్తున్నది. అసలు పురుషుల్లో వంధ్యత్వం సమస్యలు ఏర్పడడానికి గల కారణాలేంటి? వాటిని ఎలా గుర్తించాలి? సమస్య నివారణకు అందుబాటులో ఉన్న చికిత్స, పురుషుల్లో లైంగిక సామర్థ్యం క్షీణించడానికి గల కారణాలు, చికిత్స తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
పురుషుల్లో వంధ్యత్వానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పవచ్చు. అందులో 1.వీర్య కణాల సంఖ్య, 2.పురుషుల లైంగిక ఆరోగ్యం. ఈ రెండు కారణాల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నది. భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్య కణాల నాణ్యత, వీర్య కణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. కొన్ని దశాబ్దాలుగా స్పెర్మ్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. దీని కారణంగా పురుషుల్లో వంధ్యత్వ సమస్య అధికమవుతున్నది. వైద్య శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రస్తుతం ప్రతి నలుగురు పురుషుల్లో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారు. వీర్య కణాల సంఖ్య మాత్రమే కాదు, కణాల చలనశీలత (మొటిలిటీ), ఆకృతి (మాప్ఫొలొజీ), జీవక్రియ కూడా తగ్గిపోవడం వల్ల పురుషుల్లో సంతాన లేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఎందుకు తగ్గుతుంది..?
పురుషుల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణం వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం. వీర్య కణాల సంఖ్య తగ్గడానికి పలు రకాల కారణాలున్నాయి. అందులో వారికోసెల్ అనేది ప్రధాన కారణం. ఇది వృషణాల చుట్టూ ఉన్న రక్తనాళాలు విస్తరించడం వల్ల ఏర్పడే సమస్య. దీనివల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరిగి స్పెర్మ్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. ఇది కాకుండా ఈ సమస్యకు మరిన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

అవి..
- మారిన జీవనశైలి
- మానసిక ఒత్తిడి
- ఊబకాయం
- దీర్ఘకాలిక ధూమపానం
- అధిక మద్యపానం
- వ్యాయామం లేకపోవడం
- జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం
- డ్రగ్స్ వినియోగం
- కొన్ని రకాల మందులు
- మధుమేహం
- థైరాయిడ్ సమస్యలు
- అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేయడం
- రాత్రిపూట నిద్రలేమి
- వాయు కాలుష్యం, రసాయన కాలుష్యం
- పురుగుల మందులు, పారిశ్రామిక రసాయనాల ప్రభావం
భారీ తగ్గుదల
1956లో పురుషుల సరాసరి వీర్య కణాల సంఖ్య 11.6 మిలియన్/ఎంఎల్ ఉండేది. ఇప్పుడు ఈ సంఖ్య 6 మిలియన్లకు పడిపోయింది. అంటే జీవన విధానం, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ దాదాపు 50 శాతానికి పడిపోయింది. గత 60-70 ఏండ్లలో పురుషుల స్పెర్మ్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని అనేక అంతర్జాతీయ పరిశోధనలు సూచిస్తున్నాయి. ఫలితంగా వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాక భవిష్యత్ ప్రజారోగ్య సమస్యగా పరిణమిస్తున్నది.
పట్టణాల్లోనే అధికం
సాధారణంగా నగరాల్లో పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఉన్నత చదువులు, ఉద్యోగం దొరకడం, జీవితంలో సెటిల్ అవడం, ఇతర పరిస్థితుల కారణంగా ఆలస్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాకుండా వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా మానసిక ఒత్తిడి తదితర సమస్యల కారణంగా పట్టణాల్లో ఉండే పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా కనిపిస్తున్నది. మరికొన్ని ప్రధాన కారణాలు..
- ఆలస్య వివాహాలు
- కెరీర్ ఒత్తిడి
- రాత్రి ఉద్యోగాలు
- నిద్రలేమి
- ఫాస్ట్ ఫుడ్
- కాలుష్యం
- ఎకువసేపు కూర్చునే ఉద్యోగాలు
- వ్యాయామం లేకపోవడం

సకాలంలో స్పందిస్తే..
సకాలంలో పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చు. ముఖ్యంగా వివాహమైన తర్వాత ఒక సంవత్సరం పాటు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించకుండా సహజంగా ప్రయత్నించినప్పటికీ గర్భం రాకపోతే వెంటనే దంపతులు ఇద్దరూ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా 35 ఏండ్లు వయసు దాటిన దంపతులు మాత్రం వివాహమైన 6 నెలల్లో గర్భం రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే 35 ఏండ్లు గడిచిన స్త్రీ, పురుషుల్లో ఫర్టిలిటీ పొటెన్షియల్ (సంతానోత్పత్తి సామర్థ్యం) తగ్గిపోతుంది. పురుషుల్లో అప్పటికే మధుమేహం, వారికోసెల్, శస్త్రచికిత్స చరిత్ర ఉంటే ఆలస్యం చేయకూడదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
- బరువును నియంత్రించాలి.
- ధూమపానం పూర్తిగా మానేయాలి.
- మద్యపానం తగ్గించాలి.
- డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.
- రాత్రిపూట 7-8 గంటలు నాణ్యమైన నిద్ర పోవాలి.
- తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
- ప్లాంట్ ప్రోటీన్లు ఎకువగా తీసుకోవాలి.
- అధికంగా వేయించిన మాంసాహారం తగ్గించాలి.
- ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చకెర పానీయాలకు దూరంగా ఉండాలి.
- యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఆధునిక చికిత్స : సమస్యను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సమస్యను గుర్తించిన వెంటనే ఆండ్రాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. అంతేకాకుండా వైద్యుల సూచన మేరకు జీవనశైలిని మార్చుకోవాలి. యాంటి ఆక్సిడెంట్ మందులు, అవసరమైతే హార్మోన్ చికిత్స అందిస్తారు. వారికోసెల్ సమస్య ఉన్నవారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మందులతో సమస్య తీరకపోతే వారి సొంత కణాలతోనే ఐయూఐ, ఐవీఎఫ్ వంటి ఆధునిక సంతానోత్పత్తి చికిత్సలు అందించడం జరుగుతుంది.
పురుషుల్లో లైంగిక ఆరోగ్యం: పురుషుల్లో లైంగిక ఆరోగ్యం దెబ్బ తినడానికి లేదా లైంగిక సామర్థ్యం తగ్గడానికి ప్రధాన కారణాలు మూడు. అవి ఎరక్టైల్ డిస్ఫంక్షన్ (అంగస్తంభన లోపం), శీఘ్రసలనం, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తగ్గిపోవడం.
1. ఎరక్టైల్ డిస్ఫంక్షన్ (అంగస్తంభన లోపం): ఒకప్పుడు 50 ఏండ్లు దాటిన వారిలో కనిపించే అంగస్తంభన లోపం ఇప్పుడు 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు వారిలోనూ అధికంగా కనిపిస్తున్నది. వైద్య అధ్యయనాల అంచనా ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక స్థాయిలో ఈ సమస్యను ఎదురొంటున్నారు.
ప్రధాన కారణాలు
- మానసిక ఒత్తిడి
- ఉద్యోగ ఒత్తిడి
- పనితీరు గురించి భయం (పర్ఫామెన్స్ ఆైంగ్జెటి)
- డిప్రెషన్
- ఊబకాయం
- మధుమేహం
- అధిక రక్తపోటు
- గుండెజబ్బులు
- ధూమపానం, మద్యపానం
- వ్యాయామం లేకపోవడం
- కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్న చికిత్స
- జీవనశైలి మార్పులు
- మానసిక కౌన్సెలింగ్
- వ్యాయామం
- అవసరమైనప్పుడు మాత్రలు
- ఇంజెక్షన్ థెరపీ
- వాక్యూమ్ పరికరాలు
చివరి దశలో పెనైల్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స
వైద్యుల సలహా లేకుండా మారెట్లో లభించే సెక్స్ పవర్ మాత్రలు వాడటం ప్రమాదకరం. ఇవి రక్తపోటు ఒకసారిగా పడిపోవడం, గుండె సమస్యలు వంటి దుష్ప్రభావాలకు దారితీయవచ్చు.
2. శీఘ్ర సలనం: పురుషుల్లో ఎకువగా కనిపిస్తున్న మరో సమస్య ‘ప్రీమెచ్యూర్ ఈజాక్యులేషన్’ (శీఘ్ర సలనం). చాలామంది ఈ సమస్యను బయటకు చెప్పడానికి సిగ్గు పడతారు. సమస్యను వైద్యుల వద్ద చెప్పడానికి కూడా ఇష్టపడరు. దీనివల్ల చిన్న సమస్య పెద్దగా మారుతుంది. కానీ, దీనికి కూడా సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ప్రధాన కారణాలు
- మానసిక ఒత్తిడి
- ఆందోళన
- డిప్రెషన్
- సంబంధాల్లో ఉద్రిక్తత
- పనితీరు భయం
అందుబాటులో ఉన్న చికిత్స
- బిహేవియరల్ థెరపీ
- స్టార్ట్-స్టాప్ టెక్నిక్
- స్వీజ్ టెక్నిక్
- కౌన్సెలింగ్
- ప్రత్యేక మందులు
- స్ప్రేలు
- క్రీములు
- జెల్స్
టెస్టోస్టిరాన్ హార్మోన్ల లోపం: పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ల లోపం వల్ల లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. సాధారణంగా పురుషుల్లో 30 ఏండ్ల తర్వాత క్రమంగా ప్రతి సంవత్సరం సుమారు ఒక శాతం చొప్పున టెస్టోస్టిరాన్ హార్మోన్స్ తగ్గుతాయి. అయితే కొంతమందిలో మాత్రం ఇది వేగంగా తగ్గిపోతుంది.
ఫలితంగా ఈ కింది సమస్యలు ఏర్పడతాయి.
- సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోవడం
- అలసట
- మూడ్ మార్పులు
- చిరాకు
- డిప్రెషన్
- కండరాల బలం తగ్గడం
- పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం
- ఎముకల బలహీనత
- జ్ఞాపకశక్తి తగ్గడం
చికిత్స: హార్మోన్ పరీక్షలు చేసి తగిన చికిత్స అందిస్తారు. టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయులను పెంచడానికి కొన్ని రకాలు మందులు సూచిస్తారు. మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సమయానికి నిద్ర పోవాలి. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాలి.
..?మహేశ్వర్‌రావు బండారి
డా. హరి శంకర్ సింగ్
యూరాలజిస్ట్ & అండ్రాలజిస్ట్
జెమ్కేర్ పౌలోమి హాస్పిటల్
ఏ.ఎస్.రావ్ నగర్, హైదరాబాద్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

