కూరగాయలే..కొండంత బలం!

వానకాలంలో తగిన పోషకాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అలా అని, టోకుగా అన్ని కూరగాయలనూ ఆరగించాల్సిన పన్లేదు. ఈ కాలంలో ప్రాధాన్యం ఇవ్వాల్సినవైతే ఇవీ..
సొరకాయ
దీంట్లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే పీచు పదార్థాలు ఉంటాయి. ఐరన్, విటమిన్-బి,సి పుష్కలం. సొరకాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి, కడుపు తేలిగ్గా అనిపిస్తుంది.
బోడ కాకరకాయ
బోడ కాకర వల్ల ఎన్నో లాభాలు. పుష్కలమైన ప్రొటీన్లు, ఐరన్, ఫైబర్ లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరం ఇన్ఫెక్షన్ల బారినపడకుండా చూస్తాయి.
టమాట
రోగ నిరోధక శక్తిని పెంచడంలో టమాట ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్-సి, విటమిన్-కె, యాంటీ ఆక్సిడెంట్లు వానకాల సమస్యల నుంచి రక్షిస్తాయి.
ముల్లంగి
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముల్లంగి బాగా ఉపయోగపడుతుంది. రకరకాల రంగుల్లో, ఆకారాల్లో మార్కెట్లో దొరుకుతున్నది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి సర్ది, జ్వరం నుంచి కాపాడుతుంది.
బీట్రూట్
చాలామందిలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటున్నది. ఏ కూరగాయల వల్లా లభించనంత హిమోగ్లోబిన్ బీట్రూట్లో దొరుకుతుంది. ఇందులో మాంగనీస్, ఫైబర్, విటమిన్-సి, పొటాషియం, ఐరన్ పుష్కలం. బీట్రూట్ను జ్యూస్, సూప్, సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇది రక్త ప్రసరణను
మెరుగు పర్చి, రక్తపోటును నియంత్రిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కలుషితాహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
www.trudiet.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

