Gold ATM | గోల్డ్ ఏటీఎం ఎలా పనిచేస్తుంది?
Gold ATM | రూపాయి నాణెం వేస్తే రంగురంగుల చాక్లెట్లు గలగలమంటూ వచ్చి అరచేతిలో పడ్డట్టే.. డెబిట్ కార్డ్ పెట్టి, మీటనొక్కగానే తళతళ మెరిసే బంగారు నాణేలు చేతిలో రాలతాయి! జువెలరీ షాపు వరకూ వెళ్లకుండా బంగారం కొనాలనుకునే వారికోసం ‘గోల్డ్ ఏటీఎం’లు సిద్ధం అవుతున్నాయి.
ఇప్పుడు బంగారం కొనడం క్షణాల్లో పని. ఆఫీస్ నుంచి ఇంటికిపోతూ.. బ్యాంకు ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకున్నట్టుగానే, గోల్డ్ ఏటీఎంలో బంగారం కొనుక్కోవచ్చు. ఇప్పటి దాకా లండన్, దుబాయ్ లాంటి అంతర్జాతీయ నగరాలకే పరిమితమైన గోల్డ్ ఏటీఎంలు త్వరలోనే హైదరాబాద్‌లోనూ ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌తో బంగారం కొనుక్కోవచ్చు. ఈ ఏటీఎంలను ‘అజ్తార్ గ్రూప్’కు చెందిన గోల్డ్ సిక్కా లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నది. ఈ సంస్థ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ స్మార్ట్ కార్డులు కూడా తెస్తున్నది. అర తులం నుంచి పది తులాల వరకు అయితే నాణేల రూపంలో, అంతకంటే ఎక్కువ కొనాలనుకొంటే బిస్కెట్ల రూపంలో ఏటీఎం నుంచి బంగారం బయటికి వస్తుంది. దాంతోపాటే స్వచ్ఛతను తెలిపే సర్టిఫికెట్ కూడా. ప్రపంచ మార్కెట్ కదలికలను బట్టి ధరలూ మారిపోతాయి. ఆ క్షణంలో ఉన్న ధరనే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 9:50 నుంచి రాత్రి 11:30 వరకు ఈ ఏటీఎంలలో కొనుగోళ్లు చేయవచ్చు.
Read More :
“Gold Investment | బంగారం కొనుగోలుకిదే ఛాన్స్.. బట్ ప్యూరిటీ గుర్తించేదెలా?!”
“Womens on Homes | బంగారం కంటే సొంతిల్లు ముద్దు.. 69% మహిళల మనోగతం”
“ఏటీఎం వద్ద ఒక కస్టమర్ ఎంతసేపు ఓపికగా ఉండగలరో తెలుసా? ఆర్బీఐ నివేదికలో సంచలన విషయం”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- atm
- gold
- technology
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

