ఏటీఎం వద్ద ఒక కస్టమర్ ఎంతసేపు ఓపికగా ఉండగలరో తెలుసా? ఆర్బీఐ నివేదికలో సంచలన విషయం

- ఆలస్యమైతే పెరిగిపోతున్న అసహనం
- మెషీన్‌ను కొడుతూ, బ్యాంకును తిడుతూ కస్టమర్ల వింత ప్రవర్తన
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత మెషీన్లో కార్డును స్వైప్ లేదా ఇన్సెర్ట్ చేస్తాం. ఆ తర్వాత స్క్రీన్‌పై ఆప్షన్లు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత కావాల్సిన డబ్బును తీసుకొని వెళ్తాం. ఇది సాధారణంగా ఏటీఎంలలో జరిగే ప్రక్రి యే.. అయితే కొన్నిసార్లు కార్డు స్వైప్ చేసిన తర్వాత ఆప్షన్లు కనిపించడం ఆలస్యం అవుతుంది. కొంత సేపటి తర్వాత ట్రాన్సాక్షన్ ప్రారంభం కాకపోతే అసహనం పెరిగిపోతుంది. మరి.. ఒక వినియోగదారుడు సగటున ఎంతసేపు ఓపికగా ఎదురుచూడగలరో తెలుసా? కేవలం ఏడు సెకండ్లు. అంటే.. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత ఏడు సెకండ్లలోపు ట్రాన్సాక్షన్ ప్రారం భం కావాల్సిందే. లేకపోతే మెషీన్‌ను తిట్టడమో.. కొట్టడమో.. ఏటీఎంలోని సీసీ కెమెరాల వంక చూసి బ్యాంకును తిట్టడమో చేస్తుంటారట. రిజర్వుబ్యాంక్ ఇటీవల ఓ నివేదికలో చెప్పిన విషయం ఇది.
అంత సులువు కాదు
ఏటీఎంలో కార్డ్ స్వైపింగ్ మొదలు డబ్బు బయటికి వచ్చేవరకు అంతా ఆటోమెటిక్‌గా సాగే ఒక సంక్లిష్ట ప్రక్రియ. ముందుగా మెషీన్ మన కార్డ్‌లోని చిప్‌లో ఉన్న డాటాను చదువాలి. ఆ అకౌంట్ నంబర్ ఏ బ్యాంకులో, ఏ బ్రాంచ్‌లో ఉన్నదో, అందులో ఎంత డబ్బు ఉన్నదో గుర్తించాలి. ఆ బ్యాం కుతో అనుసంధానం కావాలి. అందులో నుంచి ఎంత వరకు విత్‌డ్రా చేసుకోగలరో నిర్ధారించాలి. ఆ తర్వాత లావాదేవీకి అనుమతి ఇవ్వాలి. ఈ ప్రక్రియ జరుగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా! కేవలం 1 నుంచి రెండు సెకన్లలో మాత్రమే. ఏటీఎం, ఇతర నెట్‌వర్క్‌లలో ఏదైన సమస్య ఉంటే మాత్రం ఆలస్యం అవుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా లావాదేవీలు పరిశీలిస్తే..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

