హెర్నియాపై.. శస్త్ర అస్త్రం!

హెర్నియా… శస్త్రచికిత్స ఒక్కటే మార్గమైన ఆరోగ్య సమస్య. నూటికి ఐదుశాతం మందిలో ఈ రుగ్మత కనిపిస్తుంది. తీవ్రమైన వాపు, విపరీతమైన నొప్పి ప్రధాన లక్షణాలు. సకాలంలో చికిత్స అందకపోతే ఇన్ఫెక్షన్ అధికమై, తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రాణాలకూ ముప్పే. ఈ వ్యాధికి ప్రధాన కారణాలు, వ్యాధి లక్షణాలు, చికిత్సా పద్ధతులు..
కడుపు గోడ కండరాలు బలహీనంగా ఉన్న దగ్గర నుంచి కొవ్వు కణజాలం కానీ, చిన్నపేగు కానీ బయటకు తోసుకురావడమే వైద్య పరిభాషలో ‘హెర్నియా’. కొన్నిసార్లు చుట్టుపక్కల కండరాలు బిగుసుకుపోవడం వల్ల పేగులు చిక్కుపడిపోతాయి. ఫలితంగా రక్త సరఫరా ఆగిపోవచ్చు. కుళ్లిపోయి, రంధ్రాలు కూడా ఏర్పడవచ్చు.
రెండు రకాలు
హెర్నియా ప్రధానంగా రెండు రకాలు. ఒకటి పొట్టపైన వచ్చేది, రెండోది గజ్జలలో వచ్చేది. పొట్టపై వచ్చే హెర్నియాను ‘వెంట్రల్ హెర్నియా’ అనీ, గజ్జ్జలలో వచ్చే హెర్నియాను ‘గ్రాయిన్ హెర్నియా’ అనీ అంటారు. ఈ వ్యాధి ఎవరికైనా రావచ్చు. పిల్లల్లో సాధారణంగా ‘కంజెనిటల్ హెర్నియా’ కనిపిస్తుంది. కొంతమంది బిడ్డలు హెర్నియాతో పుడతారు. ఇందుకు జన్యుపరమైన కారణాలూ ఉండవచ్చు. పెద్దల విషయానికి వస్తే, పురుషుల్లో ఇన్గ్వైనల్ హెర్నియా అధికం. దగ్గినా, వంగినా, బరువులెత్తినా నొప్పి తీవ్రంగా ఉంటుంది. అంబ్లికల్ హెర్నియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రుగ్మత వల్ల హెర్నియాలో కొంత భాగానికి రక్త సరఫరా ఆగిపోతుంది. ఈ పరిస్థితి గ్యాంగ్రిన్కు దారితీయవచ్చు. ఫెమోరల్ హెర్నియా లక్షణాలు కూడా రోగిని ఇబ్బంది పెడతాయి. గుండె స్పందన రేటు పెరిగిపోవడం, చర్మం ఎర్రబారిపోవడం, వాంతులు, మగత, జ్వరం తదితర సమస్యలు చుట్టుముడతాయి.
1.‘ఇన్గ్వైనల్’ హెర్నియా ఎక్కువగా పురుషుల గజ్జలలో వస్తుంది.
2.‘కంజెనిటల్’ హెర్నియా అనేది పిల్లల్లో వచ్చే వ్యాధి.
3.‘ఫెమోరల్ ’ హెర్నియా తొడ పైభాగంలో వస్తుంది.
4.‘ఎపిగాస్ట్రిక్’ హెర్నియా బొడ్డుపైన వస్తుంది.
5.‘ఇన్సిషనల్’ హెర్నియా.. గతంలో రోగికి జరిగిన శస్త్రచికిత్సల వల్ల వస్తుంది. అంటే, ఆపరేషన్ సమయంలో ఎక్కడైన కండరాలు తెగిపోవడం వల్ల దాపురిస్తుంది.
6.లుంబార్, ఆబ్టురేటర్, గ్లుటియల్ హెర్నియాలు.. అరుదుగా వచ్చే వ్యాధులు. మన దగ్గర పెద్దగా కనిపించవు.
కారణాలు

- కండరాల బలహీనత. ముఖ్యంగా పొత్తికడుపు కండరాలు దాదాపు అచేతనంగా మారడం.
- దీర్ఘకాలిక దగ్గు వల్ల కండరాలు సత్తువ కోల్పోయి, అవయవాలు చొచ్చుకురావడం.
- ఊబకాయం.
- ఎక్కువసార్లు గర్భధారణ.
లక్షణాలు
- గజ్జలలో వాపు.
- పొట్టపై వాపు.
- బొడ్డుపై వాపు
- వాపు ఉన్నచోట విపరీతమైన నొప్పి.
వైద్య పరీక్షలు
పొత్తికడుపులో కానీ, గజ్జలలో కానీ నొప్పి లేదా గడ్డలా అనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. వైద్య పరీక్షల ద్వారా హెర్నియాను నిర్ధారించుకోవచ్చు. అల్ట్రా సోనోగ్రఫీ, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో కూడా హెర్నియాను గుర్తించవచ్చు. హెర్నియా నిర్ధారణ తరువాత, వ్యాధికి మూల కారణాలను తెలుసు
కోవడమూ ముఖ్యమే.
చికిత్సా విధానం
హెర్నియా అనేది సర్జికల్ డిసీజ్. ఔషధాలతో చికిత్స సాధ్యం కాదు. శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. సాధారణంగా హెర్నియా చికిత్సలో హెర్నియా తీవ్రతను తగ్గించి, కండరాలపై ఏర్పడిన పగుళ్లకు మరమ్మతు చేసి.. మెష్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే, మెష్ పెడుతున్నప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. లేకపోతే, మళ్లీ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. శస్త్రచికిత్స సమర్థవంతంగా చేయకపోయినా ఇబ్బందే. హెర్నియా శస్త్ర చికిత్సను లాప్రోస్కోపిక్ లేదా ఓపెన్ సర్జరీ ద్వారా చేయవచ్చు. ఏ శస్త్రచికిత్సా పద్ధతిని ఎంచుకోవాలన్నది హెర్నియా లక్షణాల ఆధారంగా వైద్యులు నిర్ణయిస్తారు. ఎక్కువ శాతం లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే హెర్నియా సర్జరీలు చేస్తున్నారు. ఈ విధానంలో కోత ఉండదు కాబట్టి, పెద్దగా నొప్పి అనిపించదు. త్వరగా కోలుకోవచ్చు. హాస్పిటల్ నుంచి కూడా వెంటనే డిశ్చార్జ్ కావడానికి వీలుంటుంది. వీలైనంత త్వరగా, సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అయితే శస్త్రచికిత్స తరువాత కొన్ని రోజులపాటు జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలి. హెర్నియా చికిత్స సమయంలోనే, వ్యాధికి మూల కారణాలను గుర్తించి, దానికి కూడా వైద్యం చేయాలి. వ్యాధికి మాత్రమే చికిత్స చేస్తే, రుగ్మత పునరావృతమయ్యే ఆస్కారం ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వెంటనే అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించాలి.
- ఊబకాయులు బరువు తగ్గించుకోవాలి.
- పీచు పదార్ధాలు అధికంగా తీసుకోవాలి.
- దగ్గు ఉంటే, వెంటనే చికిత్స చేయించుకోవాలి.
- దీర్ఘకాలం పాటు దగ్గు లేకుండా జాగ్రత్తపడాలి.
డాక్టర్ కోన లక్ష్మీకుమారి
సీనియర్ సర్జికల్
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
బెరియాట్రిక్ సర్జన్
యశోద హాస్పిటల్, సోమాజిగూడ
మహేశ్వర్రావు బండారి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

