Health Tips | ప్రతి మనిషి వేలిముద్రలు ఒకేలా ఉండనట్లే… దంతాలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పంటి, చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి. భరించలేని నొప్పితోపాటు శాశ్వతంగా అవి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం ప్రకారం మన దేశంలో 95 శాతం మంది ఏదో ఒక రకమైన చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నారు. పదిహేనేండ్లలోపు పిల్లల్లో కనీసం 70 శాతం మంది వివిధ రకాల దంత సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని జాగ్రత్తలివి..