మూడుసార్లు నేషనల్స్ ఆడింది.. అయినా పాట కోసం ఆటను వదిలేసింది !!
Folk Singer Shruti | నెట్‌బాల్‌లో ఆమె గోల్ షూటర్. మూడు నేషనల్స్ ఆడింది. అంతలోనే పాట పరిచయమైంది. ‘పాటే’ ప్రాణమని అనుకున్నది. కానీ, పెండ్లి అంతరాయం కలిగించింది. రెండేండ్లు గడిచినయి. వెనక్కి తిరిగి చూసుకుంటే.. శ్రుతి పటేల్ జీవితం నిండా జానపదమే.
మా అమ్మవాళ్లది కరీంనగర్‌లోని మంకమ్మతోట. అత్తవాళ్లది వరంగల్‌లోని కాశీబుగ్గ. స్కూల్లో నేను నెట్‌బాల్ ప్లేయర్‌ని. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గోలి సుధాకర్ సార్ చొరవతో క్రీడల్లోకి వెళ్తే, తెలుగు టీచర్ సునీత మేడమ్ నన్ను పాటలవైపు తీసుకెళ్లింది. ఒకసారి స్కూల్ ప్రోగ్రామ్‌లో ‘గజ్జెలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్నా’ పాట పాడిన. అదే నా తొలి అడుగు.

నెట్బాల్ను వదిలేసి
డిగ్రీ సెకండ్ ఇయర్. కరీంనగర్ కళాభారతిలో ‘నెహ్రూ యువకేంద్ర’ తరఫున ‘రేలారే రేలా’ కాంపిటీషన్స్ జరుగుతున్నయి. తెలుగు లెక్చరర్ శ్రీనివాస్ సార్ ‘నువ్వు పోటీల్లో పాల్గొనాల్సిందే’ అని పట్టుబట్టిండు. దీంతో ‘అసొయ్దులా హారతి కాళ్ల గజ్జెల గమ్మతి’ పాట పాడిన. నాకు ‘ప్రత్యేక బహుమతి’ ఇచ్చిండ్రు. ఆ తర్వాత, జానపదం గురించి లోతుగా తెలుసుకోవాలని అనిపించింది. శోధించే పనిలో మునిగిన. కళాభారతిలో పాడుతున్నప్పుడు గడ్డం రమేషన్న చూసిండంట. నాకు ఫోన్ చేసి ‘నువ్వు బాగా పాడుతున్నవ్. మా టీమ్‌లో చేరు. మంచి అవకాశాలు ఉంటయి’ అన్నడు. నేనేమో నెట్‌బాల్‌లో గోల్ షూటర్ని. మూడు నేషనల్స్ ఆడిన. అయినా, పాట కోసం ఆటను వదిలేయాలె అనుకున్న. ఇంట్లో కూడా అదే అన్నరు. కొద్దిరోజులు రమేషన్న బృందంతో కలిసి ప్రోగ్రామ్స్‌కు వెళ్లిన. కోరస్ ఇస్తుండేదాన్ని. అంతలోనే, తెలంగాణ అవతరణ దినోత్సవం వచ్చింది. ‘నువ్వే ఈ ప్రోగ్రామ్‌లో మెయిన్ సింగర్’ అన్నడు రమేషన్న. ఇదో మంచి అవకాశం. నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని అనుకున్న. ప్రోగ్రామ్ మొత్తానికి నా పాటలే హైలైట్.
తొలి రికార్డింగ్
రికార్డింగ్‌లో తొలిసారిగా ‘అమ్మ అనురాగమెంతో కమ్మనైనదీ’ పాట పాడిన. అప్పుడే, మొదటిసారి స్టూడియోలోకి అడుగుపెట్టిన. రికార్డింగ్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. అప్పట్లో మీడియా, సోషల్ మీడియా ఇంతగా లేదు. సీడీ రూపంలో పాటను రిలీజ్ చేసినం. ఆ పాటను చూసిన ‘సరిగమ ఆడియోస్ అండ్ వీడియోస్’ వాళ్లు ‘ఏందో ఎంకన్నా
ఐలపురం ఎంకన్నా’ పాట ఆఫర్ చేసిండ్రు. పోస్ట్ చేసిన ఇరవై రోజులకే ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ ఉత్సాహంతో ‘సరిగమ’లో వరసగా ఐదారు పాటలు పాడిన. అన్నీ హిట్టే. తర్వాత వేరే చానెల్స్‌లో ‘పట్టూపంచె కట్టి నెత్తిన రుమాలు సుట్టీ’, ‘గట్టెంట వోతాంటె ఎంటెంట వడ్తాండు’, ‘ఊరీబైటా గజ్జెలగుట్టా.. గుట్టాకింద బావా సెరువూకట్టా’, ‘సిల్కూసీరె కట్టూకోని సింగారంగా నేనొస్తే’, ‘పుట్టమీదా పుంజుగూసే.. కట్టమీదా కంజూగూసే’, ‘పల్లెభామను నేనయ్యో.. సల్ల అమ్ముతానయ్యో’ వంటి పాటలు పాడిన.

యాంకరింగ్ చాన్స్
డీడీ యాదగిరిలో ఫోక్ సింగర్స్ స్పెషల్ ప్రోగ్రామ్ వస్తుండె. నేనూ వెళ్లిన. పాట బాగా వచ్చింది. అయితే.. ‘శ్రుతీ నువ్వు యాంకర్‌నే డామినేట్ చేస్తున్నవ్. యాంకరింగ్ ట్రై చేయొచ్చుగా’ అన్నరు నిర్వాహకులు. వాళ్ల ప్రోత్సాహంతో రెండేండ్ల పాటు యాంకర్‌గా చేసిన. తర్వాత ఎన్టీవీలో ఫ్రీలాన్సర్‌గా బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, దసరా, ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా చేసిన. అప్పుడప్పుడే సోషల్ మీడియా పుంజుకుంటున్నది. నాకు తెలిసి ఒకరిద్దరు సింగర్స్ మాత్రమే లైవ్‌లో ఉన్నరు. అటు సింగర్‌గా, ఇటు యాంకర్‌గా కెరీర్ టర్నింగ్ తీసుకుంటున్న సమయంలో నా పెండ్లి అయ్యింది. ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పుట్టింటివాళ్లూ కొంతకాలం మాట్లాడలేదు. ఆ సమయంలో మా ఆయన సాయివర్ధన్ నాకు అండగా నిలిచిండు. ఆ ఉత్సాహంతో గొంతు సవరించుకొని మళ్లీ పాటలు పాడుతున్న. బయట ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్న. ‘శ్రుతి ఫోక్స్’ పేరుతో యూట్యూబ్ చానెల్ పెట్టిన. త్వరలో ఓ మంచి పాటను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నం. నా కొడుకు మోక్షిత్‌ను చూసుకుంటూ, మంచి మంచి పాటలు పాడుతూ.. యాంకరింగ్‌లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
… దాయి శ్రీశైలం
Read More :
“పాఠాలతో పాటు పాటలు నేర్పిస్తూ పల్లె పాటల చిరునామాగా మారిందీమె !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- folk singer
- inspiration
- songs
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

