క్యాన్వాస్, స్పోర్ట్స్, క్యాజువల్స్… ఇలా రకరకాల షూస్ ఇప్పటి వరకూ వేసుకునే ఉంటారు. ఎన్నో రంగులూ, మోడళ్లూ ప్రయత్నించే ఉంటారు. కానీ చూడగానే ఆకట్టుకునేలా ఉండే షూస్ ఎంచుకోవాలంటే మాత్రం కష్టమే. ఇదిగో, అలాంటి ప్రత్యేకతలున్నవే ‘ఫైబర్ ఆప్టిక్ ఎల్యీడీ షూస్’. అచ్చం ఎల్యీడీ బల్బుల్లా కాంతులు విరజిమ్మే ఈ షూస్ గులాబీ, ఎరుపు, నీలం, ఆకుపచ్చ తదితర రంగుల్లో కనువిందు చేస్తాయి.
ఒకే రంగులో కాంతులు విరజిమ్మడంతో పాటు వెలుగుతూ ఆరుతూ ఉండేలా ఫ్లాష్ మోడ్నూ ఎంచుకోవచ్చు. మనం వేసుకున్న దుస్తులు, వెళ్తున్న వేడుకను బట్టి నచ్చిన రంగు కాంతిని సర్దుబాటు చేసుకోవచ్చు. ఇవి చార్జింగ్‌తో పనిస్తాయి. లైట్లు ఆపేసి మామూలు బూట్లలా కూడా వాడుకోవచ్చు. షూతో పాటు వచ్చే యూఎస్బీ సాయంతో వీటికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. అమ్మాయిల కోసం ప్రత్యేక డిజైన్లు సిద్ధం చేశారు. అమెజాన్ లాంటి ఇ-దుకాణాల్లో లభిస్తున్నాయి.