మార్కెట్లనూ కొల్లగొట్టారు..
ప్రేమికులంతే.. భాగస్వామి హృదయాలను ఇట్టే కొల్లగొట్టేస్తారు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా.. మార్కెట్లనూ కొల్లగొట్టారట. తమ ఇష్టసఖులకు కానుకలుగా అందించడానికి అధికమొత్తంలో కొనుగోళ్లు చేశారట.
ప్రేమికులంతే.. భాగస్వామి హృదయాలను ఇట్టే కొల్లగొట్టేస్తారు. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా.. మార్కెట్లనూ కొల్లగొట్టారట. తమ ఇష్టసఖులకు కానుకలుగా అందించడానికి అధికమొత్తంలో కొనుగోళ్లు చేశారట. యూనికామర్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ సంస్థలకూ భారీ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి 1 నుంచి 10 మధ్య .. దాదాపు 1.5 కోట్లకు పైగా ఆర్డర్లు చేసినట్లు వెల్లడైంది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే షాపింగ్‌లో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అగ్రస్థానంలో నిలిచాయి.
గతేడాదితో పోలిస్తే వీటి ఆర్డర్ వాల్యూమ్‌లో 48శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు చివరి నిమిషంలో బహుమతులు పంపేందుకు వీటిని ఎక్కువగా ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా మొత్తం ఈ-కామర్స్ ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 17 శాతం పెరిగాయి. ఇక డైరెక్ట్ టూ కస్టమర్ బ్రాండ్ వెబ్సైట్లు 16 శాతం వృద్ధిని సాధించాయి. ఇక కొనుగోళ్ల విషయంలోనూ ఎన్నో మార్పులు కనిపించాయి. సాధారణంగా ఇచ్చే గులాబీలు, చాక్లెట్లతోపాటు ఇతర విభాగాల్లోనూ కొనుగోళ్లు పెరిగాయి.
నవతరం ప్రేమికులు బ్యూటీ-పర్సనల్ కేర్‌కు పెద్దపీట వేశారు. స్కిన్‌కేర్ కిట్లు, పెర్ఫ్యూమ్స్, మేకప్ కాంబోలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఆర్టిసానల్ టీలు, విదేశీ చాక్లెట్లు, ఆరోగ్యకరమైన స్నాక్స్‌కు ఆ తరవాతి స్థానం దక్కింది. ఇంతకుముందు మెట్రో నగరాల్లోనే కనిపించే ఈ పోకడ.. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ ఊపందుకుంది. వాలెంటైన్స్ డే కొనుగోళ్లలో మెట్రో నగరాల్లో 19 శాతం వృద్ధి
కనిపించగా.. టైర్-2 నగరాల్లో 14 శాతం, టైర్-3 నగరాల్లో దాదాపు 18 శాతం వృద్ధి నమోదైంది. చిన్న నగరాల్లోనూ డిజిటల్ షాపింగ్ పట్ల ఆసక్తి పెరిగిందని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
KCR | ఇదీ.. కేసీఆర్ పాలనాదక్షత.. కాళేశ్వరం నీటితో మత్తడి దుంకుతున్న వెలిచాల చెరువులు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

