చీర ఎంత గ్రాండ్‌గా ఉన్నా నప్పే బ్లౌజ్ ఉంటేనే అందం ఇనుమడించేది. అందుకే పట్టు, ప్రింటెడ్ చీరలమీద మ్యాచ్ అయ్యేలా మగువలు వర్క్ బ్లౌజ్‌లు వేసుకుని మెరిసిపోతారు. అయితే పట్టు, ఫ్యాన్సీ చీరలే కాకుండా ప్లెయిన్ చీరలపైకి కూడా వర్క్ బ్లౌజ్‌లు నప్పుతాయి. ఈ వారం దారంతో మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ డిజైన్ల గురించి..
మెరూన్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్‌పై పువ్వులు, ఆకులతో నిండిన తీగలతో కూడిన డిజైన్‌లో.. దారంతో మగ్గం వర్క్ చేశారు. రెడ్ కలర్‌పై హైలైట్ అయ్యేలా ఎల్లో, బ్లూ ఫ్లవర్స్ ఇచ్చి పచ్చని ఆకులు జత చేశారు. బ్లౌజ్‌పై ఉన్న బ్లూ కలర్ ఫ్లవర్స్ కాంట్రాస్ట్‌గా ప్లెయిన్ బ్లూ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ డిజైన్ చేశారు. బ్లౌజ్ వెనకాల ఇచ్చిన డిజైన్‌తోనే చేతులు కూడా ఇవ్వడంతో హైలైట్ అయ్యింది.
గ్రీన్ కలర్ రా సిల్క్‌పై మల్టీకలర్ త్రెడ్స్‌తో చేసిన రాధాకృష్ణుల డిజైన్ ఇది. చుట్టూ ఆకులు, లతలతోపాటు పక్షులను కూడా దిద్దారు. గ్రీన్ కలర్ బ్లౌజ్‌కి కాంట్రాస్ట్‌గా వైన్ కలర్ పట్టు ప్లెయిన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో శారీ ఇచ్చారు. బ్లౌజ్‌కి శారీ కలర్‌తో నెక్, చేతులకు డోరీ పైపింగ్ చేశారు. చేతులు కాస్త పొడవుగా ఇచ్చి రాధాకృష్ణుల డిజైన్ చేశారు.
పచ్చని పసుపునకు నీలిరంగు జాబిల్లి తోడైనట్టు.. ఈ కాంబినేషన్ ఎప్పుడూ ప్రత్యేకమే. అందంగా ఆకర్షించే డార్క్ బ్లూ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్‌పై పక్షులు, పువ్వులు, ఆకులతో కూడిన ప్రకృతి అందాలను పొదిగారు. బ్లూ కలర్‌పై చక్కగా కనిపించే రంగుల దారంతో చేసిన మగ్గం వర్క్వల్ల బ్లౌజ్ నిండుదనంతో చక్కగా కనిపిస్తున్నది. చేతులకూ ఆకులతో కూడిన లతలను జోడించారు. బ్లౌజ్‌ను డామినేట్ చేయకుండా పచ్చని పసుపు రంగులో ఇచ్చిన ప్లెయిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ చీర ట్రెండీ లుక్ తెచ్చింది.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335