కొవిడ్-19 వ్యక్తుల శరీరం మీదే కాదు దీర్ఘకాలంలో మనుషుల మానసిక స్థితి మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది. యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కొవిడ్ బారిన పడినవారు దీర్ఘకాలంలో డిప్రెషన్, ఆందోళన, జీవితం పట్ల అసంతృప్తికి గురవుతున్నారని వెల్లడైంది.
2020 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ మధ్యకాలంలో వివిధ ప్రాంతాలు, వయసులకు చెందిన దాదాపు 55 వేల మందిపై జరిపిన పరిశోధన ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో ఆ లక్షణాలు తగ్గిపోయినా కూడా మానసికస్థితి మాత్రం పూర్తిస్థాయిలో మెరుగవ్వలేదట. అందులోనూ యాభై ఏండ్ల పైబడిన వారు ఎక్కువగా కుంగుబాటుకు గురవుతున్నారని పరిశోధన సారాంశం.