కార్న్ వెజ్ రోల్స్

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి: రెండు కప్పులు, స్వీట్ కార్న్: అర కప్పు, ఉల్లిపాయ: చిన్నది, క్యాప్సికమ్, క్యారెట్ తురుము: అరకప్పు, సోయా సాస్: పావు టీస్పూన్, చిల్లీ సాస్: ఒక టీస్పూన్, అజినమొటొ: చిటికెడు, మిరియాలపొడి: చిటికెడు, టమాటా సాస్: ఒక టీస్పూన్, కొత్తిమీర తరుగు: కొద్దిగా, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి: రెండు,
నూనె: సరిపడా
తయారీ విధానం: గోధుమపిండిలో చిటికెడు ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు కలుపుకొంటూ చపాతీ పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్‌ని ఆవిరి మీద ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కాస్త మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత క్యారెట్, క్యాప్సికం తురుము వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్, తగినంత ఉప్పు, అజినమొటొ, మిరియాలపొడి, కొత్తిమీర వేసి కలిపి మరో రెండు నిమిషాలు వేగనిచ్చి దింపేయాలి. పక్కనపెట్టిన పిండితో చపాతీలు చేసుకోవాలి. వేడివేడి చపాతీ మధ్యలో కూరపెట్టి రోల్స్‌లా చుట్టుకుంటే కార్న్ వెజ్ రోల్స్ రెడీ!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- corn
- Food
- immunity food
- tasty food
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

