కొవ్వు కరిగిపోవాల్సిందే!
అద్భుతమైన ఔషధాల గనిగా భారతీయుల వంటగదికి మరోపేరు. రుచికరమైన వంటకాల కోసం మనం వాడే మసాలా దినుసులు రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి కొండంత ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి.
అద్భుతమైన ఔషధాల గనిగా భారతీయుల వంటగదికి మరోపేరు. రుచికరమైన వంటకాల కోసం మనం వాడే మసాలా దినుసులు రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి కొండంత ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. అలాంటి వాటిలో దాల్చినచెక అత్యంత ముఖ్యమైనది. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానముంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గడానికి రకరకాల డైట్లు, వ్యాయామాలు చేసే వారు తమ రోజువారీ జీవనశైలిలో చిన్న మార్పు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు దాల్చినచెక నీరును తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా, రక్తంలో చకెర స్థాయులు అదుపులో ఉంటాయి. ‘న్యూట్రిషన్ రీసెర్చ్’ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన ఒక తాజా పరిశోధన ప్రకారం, దాల్చినచెక జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుందని తేలింది.
దీనిని క్రమంగా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోబయోటిక్ లాంటి లక్షణాలు గట్ హెల్త్ని కాపాడతాయి. మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమై, అందులోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించాలన్నా, జీవక్రియలు వేగవంతం కావాలన్నా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. జీర్ణక్రియ బాగున్నప్పుడే బరువు తగ్గడం సులువవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

