షాండిలియర్ చాందిని!

ఆకాశానికి నక్షత్ర మండలంలా. ఇంటికి షాండిలియర్! ఎన్ని విద్యుత్ దీపాలున్నా.. షాండిలియర్ దర్జాయే వేరు! గదికి రాచఠీవిని తెస్తుంది. ఆ వేలాడే దీపాల గుత్తి.. అతిచిన్నగా మారిపోయి ఓ ఆభరణ రూపం ధరిస్తే? అవే షాండిలియర్ నగలు! ఆ జూకాలతో మగువ నడిచినంత మేరా సౌందర్య సౌధమే.
షాండిలియర్ నగల ప్రత్యేకతే వేరు. డిజైన్ ఒకటే. కానీ పలు వరుసల్లో, వివిధ ఆకారాల్లో.. క్రిస్టల్స్‌ను ఇముడ్చుకుని ధగధగలాడుతాయి. చెవి నుంచి మెడ వరకు వేలాడే షాండిలియర్ జూకాలు.. సంప్రదాయాన్నీ, ఆధునికతనూ ప్రతిబింబిస్తాయి.
చక్కగా చవకగా
షాండిలియర్ డిజైన్లలో క్రిస్టల్స్ కాకుండా.. కాగితం, ఫ్యాబ్రిక్ ముక్కలను జోడించి కూడా నగలను రూపొందిస్తున్నారు. వీటి ధర చాలా తక్కువ. దీంతో రోజువారీ దుస్తులకు నప్పే రకరకాల డిజైన్లను కొనుగోలు చేయవచ్చు. ఆకులు, పువ్వులు, ఈకల వంటి ప్రకృతి అందాలను కూడా పొదుగుతున్నారు.
‘వన్ గ్రామ్’లోనూ
బంగారం, వెండి, ప్లాటినం తదితర లోహాలతో చేసిన ఆభరణాల్లో ముత్యాలు, వజ్రాలు, జాతిరత్నాలను పొదిగి కూడా షాండిలియర్ నగలను తయారు చేస్తున్నారు. తక్కువ ధరలో వన్‌గ్రామ్ గోల్డ్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. తేలికపాటి క్రిస్టల్స్‌తో రూపొందించడం వల్ల ఎంత పెద్ద నగ పెట్టుకున్నా తేలికగానే అనిపిస్తుంది. కొన్ని డిజైన్లలో ఒక్క రాయి కూడా పొదగకుండానే.. కేవలం బంగారంతో దొంతరలు దొంతరలుగా షాండిలియర్‌ను పోలిన బంగారు పూసలను జతచేస్తారు. బుట్టాలు, గుట్టపూసలతో తయారయ్యే ఈ ఆభరణాలు సంప్రదాయ దుస్తులపై నిండుదనాన్ని ఇస్తాయి. ఆధునిక వస్ర్తాలపై ధరించేందుకు వీలుగా సన్నటి గొలుసులతో రూపొందించినవీ ఉన్నాయి.
ఊగుతూ.. ఊరిస్తూ!
ఈ నగలు చూసేందుకూ భిన్నంగా ఉంటాయి. సరికొత్తగా కనిపిస్తాయి. ఎగుడుదిగుడుగా, ఆరోహణ-అవరోహణ క్రమంలో ఉంటాయి. లయబద్ధంగా ఊగుతాయి. రాత్రిపూట జరిగే వేడుకల్లో విద్యుద్దీపాల వెలుగుతో పోటీ పడతాయి. పాపిటబిళ్లల నుంచి పట్టీల వరకు అన్ని ఆభరణాలూ షాండిలియర్ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. తల నుంచి పాదాల వరకూ.. ఒకే కాన్సెప్ట్‌తో రూపొందించిన కాంబో ఆఫర్లలోనూ షాండిలియర్ మెరుపులు లభిస్తున్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

