బ్రోలెడు స్వీట్స్!
తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆ తీయని బంధానికి మరింత తీపిని జోడిస్తూ ‘మీనియేచర్ ఫుడ్ రాఖీలు’ వచ్చేశాయి. మన కంచంలో ఎన్నిరకాల పిండివంటలైనా ఉండనీ అక్క దగ్గరో, చెల్లి చేతిలోంచో లాక్కొని తిన్న లడ్డూ రుచే వేరు.
తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఆ తీయని బంధానికి మరింత తీపిని జోడిస్తూ ‘మీనియేచర్ ఫుడ్ రాఖీలు’ వచ్చేశాయి. మన కంచంలో ఎన్నిరకాల పిండివంటలైనా ఉండనీ అక్క దగ్గరో, చెల్లి చేతిలోంచో లాక్కొని తిన్న లడ్డూ రుచే వేరు. అన్నయ్య పళ్లెంలోని పులిహోరలో నాలుగు పల్లీలైనా తీసుకోకపోతే చెల్లికి భోంచేసినట్టే అనిపించదు. స్నాక్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు. కోరికోరి పాప్కార్న్ కొనుక్కున్నా.. తమ్ముడి ఫ్రెంచ్ ఫ్రైస్లో వాటా అడగడం, బ్రహ్మాండమైన బర్గర్ ఆర్డర్ చేసుకొన్నా చెల్లి దగ్గర పిజ్జా ముక్క గుంజుకోవడం.. ఇవన్నీ అప్పటికప్పుడు తగాదాల్లా అనిపించినా, జ్ఞాపకాల ఆల్బమ్లో మాత్రం మధురస్మృతులుగా మిగిలిపోతాయి.

ఈ ‘మీనియేచర్ ఫుడ్ రాఖీలు’ తోబుట్టువులను మరొక్కసారి బాల్యంలోకి తీసుకెళ్తాయి. వీటిని మట్టి, చెక్క, పింగాణి, ఆక్రిలిక్లాంటి రకరకాల పదార్థాలతో తయారు చేస్తారు. లడ్డు, కాజూ కత్లీ, జాంగ్రీలాంటి స్వీట్లను పోలిన త్రీడీ బొమ్మలూ ఉన్నాయి ఇందులో. ఇక టిఫిన్లను ఇష్టపడేవారి కోసం ఇడ్లీ, వడ, దోశ వగైరా ఫలహారాల నమూనాలో రాఖీలు తయారు చేశారు. అంతేనా పానీపూరి, వడాపావ్, సమోసాలతో పాటు పిజ్జా బర్గర్లూ దర్శనమిస్తున్నాయి. ఇవి కాకుండా లేస్, డోరిటోస్లాంటి చిరుతిళ్ల ప్యాకెట్ల్లు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యమెందుకు? మీ ‘బ్రో’ కోసం వెంటనే ఆర్డర్ చేసేయండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Raksha Bandhan
- sweets
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

