చిరునవ్వుల బాల్యాన్ని బేల చూపులకు పరిమితం చేస్తుంది ఆటిజం. బిడ్డ పెరిగే కొద్దీ ఆ తల్లిదండ్రులకు కలవరపాటే! ఆందోళనలను, అపోహలను పక్కనపెట్టి అండగా నిలిస్తే ఆ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారదు అంటున్నారు మానసిక నిపుణులు. అసలు ఆటిజం అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ సమస్యను ఎలా నివారించాలో తెలుసుకుందాం.
కొందరు చిన్నారులు ఎన్నిసార్లు పేరుపెట్టి పిలిచినా పలకరు. ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్టు వ్యవహరిస్తారు. ఇతరులతో మాట్లాడరు. భావ వ్యక్తీకరణలో ఇబ్బందులకు గురవుతారు. పెద్దపెద్ద శబ్దాలు చేస్తుంటారు. ఇవన్నీ ఆటిజం లక్షణాలే. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలు మన చుట్టూ ఉంటారు. వారిని చూసి జనం జాలిపడటాన్నీ గమనిస్తుంటాం. నిజానికి, ఆటిజం జబ్బు కానేకాదు. నాడీ వ్యవస్థ వైఫల్యం వల్ల ఈ పరిస్థితి వస్తుందని పరిశోధకులు తేల్చారు. గర్భిణిగా ఉన్నపుడు తల్లి ఆరోగ్య పరిస్థితి, టీకాలు వికటించడం, అసలు టీకాలే తీసుకోకపోవడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, జన్యు లోపాలు.. తదితర కారణాల వల్ల బిడ్డకు ఆటిజం వచ్చే ఆస్కారం ఉంది. ఆటిజం నిర్ధారణ కాగానే.. బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు.
సమస్యను త్వరగా గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. ఆటిజం పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో తరచూ జబ్బులపాలయ్యే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి పిల్లలకు ఎలాంటి దుష్ప్రభావాలు లేని చికిత్సలు ఇవ్వాలి. వారి అవసరాలు, మానసిక సామర్థ్యం ఆధారంగా ఆలనాపాలనా చూసుకోవాలి. ప్రేమతో చదువులు చెప్పాలి. ఆసక్తులను గమనించి, ఆ రంగంలోనే శిక్షణ ఇవ్వాలి. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆటిజం చిన్నా రులను మేటి పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. వారికంటూ ఓ ప్రపంచాన్ని నిర్మించి ఇవ్వవచ్చు. కన్నవారిగా ఇది మన బాధ్యత కూడా.
బొర్రా శిరీష
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ
హ్యాండీక్యాప్డ్, సికింద్రాబాద్