HomeZindagiAnimals Face Many Problems During Winter
చలికాలం.. పెట్స్ పైలం!
మనుషులంటే కాలానికి తగ్గట్టుగా సంరక్షణ చర్యలు తీసుకుంటారు. మరి, పెంపుడు జంతువుల సంగతేంటి? ముఖ్యంగా.. చలికాలంలో జంతువులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి సంరక్షణ కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిందే!
మనుషులంటే కాలానికి తగ్గట్టుగా సంరక్షణ చర్యలు తీసుకుంటారు. మరి, పెంపుడు జంతువుల సంగతేంటి? ముఖ్యంగా.. చలికాలంలో జంతువులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి సంరక్షణ కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిందే!
పెంపుడు జంతువుల కోసం ఇంట్లోనే ఒక ప్రత్యేక పెంట్ హౌస్‌ని ఏర్పాటు చేయండి. అందులో వెచ్చగా ఉండే పరుపులు, బ్లాంకెట్ అమర్చండి.
వాటికి వేడివేడి ఆహారం అందించాలి. అదికూడా మోతాదును పెంచి ఇవ్వండి. ఎందుకంటే.. చలికాలంలో జంతువులు తమ శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుకోడానికి ఎక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి. దీనివల్ల వాటికి ఎక్కువగా ఆకలి వేస్తుంది.
చలికాలంలో పెంపుడు జంతువుల వెంట్రుకలు కత్తిరించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే, వెంట్రుకలే.. వాటికి చలిని తట్టుకునే శక్తిని అందిస్తాయి.
ఇక వెంట్రుకలు తక్కువగా ఉండే జంతువులకు మందపాటి పెట్ టీషర్ట్, జాకెట్, క్యాప్, స్వెటర్ లాంటివి తొడగండి.
వ్యాయామంతో శరీరంలో వేడి పుడుతుంది. కాబట్టి మీ పెంపుడు జంతువులను కూడా మీ వెంటే వాకింగ్, జాగింగ్‌కు తీసుకువెళ్లండి. వాటితో చిన్నచిన్న వ్యాయామాలు చేయించండి.
కొన్ని జంతువులకు శీతకాలంలో కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. అందుకే.. ఒకసారి డాక్టర్‌ను కలవండి. వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాటికి అందించండి.
చలికి జంతువుల పాదాలు పొడిబారి పగులుతుంటాయి. సమస్యను నివారించడానికి ‘పాప్ బామ్స్’ మార్కెట్లో దొరుకుతాయి.