మహిళలపై ఏఐ పంజా
ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక.. ‘జెండర్ స్నాప్‌షాట్-2025’ ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక.. ‘జెండర్ స్నాప్‌షాట్-2025’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో ఐటీ రంగంలో జెండర్ డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సదరు నివేదిక పిలుపునిచ్చింది. అంతేకాకుండా.. డిజిటల్ రంగంలో లింగ అసమానతలను కూడా ఈ నివేదిక హైలైట్ చేస్తున్నది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. ప్రపంచ టెక్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు కేవలం 29శాతం మంది మాత్రమే ఉన్నారు.
అదే నాయకత్వం స్థానాల్లో మహిళల వాటా 14శాతం మాత్రమే! ఈ క్రమంలో ఐటీ రంగంలో పురుషాధిక్యమే రాజ్యమేలుతున్నదనీ, ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ రంగంలో లింగ సమానత్వాన్ని సాధించడం ద్వారా.. 34.5 కోట్ల మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. 3 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి బయటపడేసే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. మరో 4.2 కోట్ల మందికి ఆహార భద్రత దక్కుతుందని వెల్లడిస్తున్నారు. ఇందుకోసం మహిళలకు ఏఐపై శిక్షణ ఇప్పించడం, డిజిటల్ సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు మహిళలకు కార్మిక-సామాజిక రక్షణ విధానాలను అమలు చేయడం ముఖ్యమని చెబుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

