Sonia Akula | కాలేజీ రోజుల్లోనే సేవ.. ఇప్పుడు అనాథ ఆడబిడ్డల కోసం కృషి
Sonia Akula | పక్కా మధ్య తరగతి కుటుంబం. ఆలోచనలు మాత్రం ఉన్నతం. కాబట్టే కాలేజీ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. అనాథ ఆశ్రమాల్లో పాఠాలు చెప్పింది. ఎన్జీవోలతో కలిసి పనిచేసింది. ఓ స్వచ్ఛంద సంస్థనూ స్థాపించింది. అవకాశం వస్తే సినిమాల్లోనూ నటించింది. సోనియా ఆకుల జీవితం వైవిధ్య భరితం. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ శక్తి’ని విజయవంతం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నది. ఆ ప్రయాణం తన మాటల్లోనే..
మా సొంతూరు మంథని. అమ్మ మల్లీశ్వరి గృహిణి. నాన్న చక్రపాణి వ్యవ సాయం చేసేవారు. ఇంటర్ నుంచి హైదరాబాద్‌లోనే చదువుకున్నా. అమ్మను చూసి స్వతంత్రంగా బతకడం నేర్చుకున్నా. ఆడపిల్లలు చదువుంటే ఏదైనా సాధించగలరని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఐఏఎస్ అధికారిగా
ప్రజలకు సేవ చేయాలని కలలుగనేదాన్ని. కాలేజీ రోజుల్లో అనాథ బాలలకు నా వంతు సాయం చేసేదాన్ని. ఎన్సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లలో చురుగ్గా పాల్గొనేదాన్ని. అప్పుడే నాకు సేవ పట్ల ఆసక్తి కలిగింది. ‘ఆసా’ అనే ఫౌండేషన్‌ను ప్రారంభించాను. చదువుకుంటూనే సంతోష్‌నగర్‌లోని ఓ అనాథాశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పేదాన్ని. తరుణి, యువభారతి, రామకృష్ణ మఠం తదితర సంస్థలతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా. బీటెక్ పూర్తయ్యేంత వరకూ నాకు సివిల్స్‌పైనే గురి ఉండేది. రెండుసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అన్నయ్యల్లో ఒకరు ఇంజినీర్, ఒకరు డాక్టర్. మొదట్లో మేం ముగ్గురం కలిసి సేవా కార్యక్రమాలు చేపట్టాం. దానికి స్నేహితుల సాయమూ తోడైంది. లాక్డౌన్ సమయంలో వేలాదిమంది ఆకలి తీర్చాం. ఫౌండేషన్ ద్వారా గ్రామాల్లో కమిటీలు వేయించాం.

సినిమాల్లోకి..
ఇంజినీరింగ్ తర్వాత కొంతకాలం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. అక్కడ తరచూ అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగేవి. అధికారులకు నా గురించి తెలిసి కొన్ని కార్యక్రమాలకు హోస్ట్‌గా పిలిచారు. నా మాటతీరు నచ్చి మామిడి హరికృష్ణగారు రవీంద్రభారతిలో ‘సినీవారం’ ప్రోగ్రామ్‌కు హోస్ట్ చేయించారు. ఆ సమయంలో కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ కూడా చేశాను. కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశమూ వచ్చింది. వాటిని చూసి నాకు ‘జార్జిరెడ్డి’ సినిమాలో చెల్లె క్యారెక్టర్ ఇచ్చారు. చిన్నపాత్రే అయినా మంచి గుర్తింపు వచ్చింది. అందులో నా నటన చూసి రామ్‌గోపాల్ వర్మగారు ‘వైరస్’ మూవీలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. ‘ఆశా ఎన్కౌంటర్’ చిత్రంతో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఆ పాత్ర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ‘అత్యాచారం లాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు బాధితురాలిని తప్పుపట్టే మనస్తత్వం ఇంకా పోలేదు. మహిళనే నిందితురాలిగా చూసే ధోరణి అమానుషం. పల్లెటూరిలో పుట్టి పెరిగిన పిల్లగా.. నాకు ప్రజల సమస్యలపై అవగాహన ఉంది. అందుకే సేవారంగమే నా తొలి ప్రాధాన్యం. సినిమా ద్వారా వచ్చే డబ్బుతో విస్తృతంగా సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి, పరిశ్రమనూ వదిలిపెట్టను.

అనాథల కోసం..
ఏ దిక్కూలేని ఆడబిడ్డల చదువుల కోసం ప్రారంభించిన కార్యక్రమం.. ప్రాజెక్ట్ శక్తి. ఇందులో భాగంగా వందమంది అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకొని, ఉచితంగా చదువు చెప్పించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం పదిమందిని ఎంపిక చేశాం. నేను లాస్య అనే పాపను దత్తత తీసుకొని చదివిస్తున్నాను. మంథని, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఐదు గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేశాం.
– డప్పు రవి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
“Madhumita | ప్రస్తుతానికి ప్రేమ, పెండ్లి ఆలోచనలు లేవంటున్న నెం.1 కోడలు ఫేమ్ మధుమిత”
“Shreya katuri | అగ్గిపెట్టెల సేకరణే ఆమె లోకం.. వాటితో ఏం చేస్తుందో తెలిస్తే షాకవ్వల్సిందే”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

