ఇవాళ్టి బతుకమ్మ – నాను బియ్యం బతుకమ్మ
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా అంటూ అమ్మకు ఏదో ఒక రూపంలో అన్నాన్ని నివేదిస్తారు.
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా అంటూ అమ్మకు ఏదో ఒక రూపంలో అన్నాన్ని నివేదిస్తారు. ‘అన్నదా వసుధా వృద్ధా, బ్రహ్మాత్మైక స్వరూపిణీ’ శరీరం నిలవాలంటే అన్నం కావాలి. అలసట తీరాలంటే ఆహారం తీసుకోవాలి.
బతుకమ్మ ఆడి ఆడి అలసిన పిల్లలకు అమ్మకు నివేదించిన ప్రసాదం పెడతారు. ప్రసాదం అంటే పది మందితో కలిసి పంచుకునేది. అది బలవర్ధక పదార్థమై ఉండాలి. రుచిగా ఉంటే మరీమరీ అడిగి తింటారు. ఎదుగుతున్న ఆడపిల్లలకు అది అవసరం కూడా! రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడిన జగన్మాత ఆకలితో అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానిన బియ్యంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు.
బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి.. మెత్తని పిండిగా చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లాగా చిన్న ఉండలుగా చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలని పిలుస్తారు. శరదృతువులో వచ్చే అనేక పండుగల్లో పచ్చిపిండి ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పిస్తారు. కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి బియ్యానికి కొదువ ఉండదు. పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకే నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడతారు.
– డా॥ ఆర్. కమల
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

