భారతీయ మహిళల మొదటి ప్రాధాన్యం చీర. టీనేజ్ ఆడపిల్లలైతే ఎప్పుడెప్పుడు చీర కట్టుకుంటామా అని ఎదురు చూస్తారు. వివాహిత గౌరవాన్ని పదింతలు పెంచేస్తుంది చీరకట్టు. అయితే, ఎప్పుడూ ఒకే రకం బార్డర్.. ఒకే రకం బుట్ట డిజైన్ కట్టుకోవాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అలాంటి పాత డిజైన్లకు చెక్ పెట్టి, ఈ కొత్తరకాలు ట్రై చేస్తే వంద మందిలో అయినా సరే.. మీరే ఆకర్షణీయంగా నిలుస్తారు. కాకపోతే, ఇంట్లో కొంత హోమ్‌వర్క్ చేయాలి, అదీ కళాత్మకంగా!
మస్టర్డ్ ఎల్లో ప్యూర్ టిష్యూ కాటన్ ఫ్యాబ్రిక్‌ను తీసుకుని, ముందు భాగంలో వివిధ రంగుల దారాలతో పువ్వులు, ఆకులను డిజైన్ చేశాం. మగ్గం వర్క్‌లో భాగమైన నాట్ పద్ధతితో
డిజైన్‌ను మరింత గ్రాండ్‌గా మార్చాం. అలాగే, చీరకు కాంట్రాస్ట్ రంగైన రాయల్ బ్లూ కాటన్ సిల్క్‌తో చీర మొత్తం డోరీ పైపింగ్ చేశాం. వెల్వెట్ రాయల్ బ్లూ కలర్ డిజైనర్ బ్లౌజ్‌కి స్టాండ్ కాలర్ ఇచ్చాం. దానికి పెద్దసైజు కుందన్లు కుట్టి బ్లౌజ్‌ను మరింత హైలైట్ చేశాం. హ్యాండ్స్‌కి పఫ్ హ్యాండ్స్ ఇవ్వడంతో చీరకట్టు మరింత అందంగా మారింది.
ఆనందా బ్లూ ప్యూర్ టిష్యూ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని, ఫ్రంట్ బస్ట్ భాగంలో వివిధ రంగుల దారాలతో దీర్ఘచతురస్రాకారంలో మగ్గం వర్క్ చేశాం. పింక్ కలర్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో చీర మొత్తం బార్డర్‌లా డోరీ పైపింగ్ ఇచ్చాం. చీరకు ఇచ్చిన వర్క్‌లాగే బ్లౌజ్‌పై ఒక భుజానికి పింక్ కలర్ పట్టు సిల్క్ ఫ్యాబ్రిక్‌తో వర్క్ చేశాం. చేతులకు రెండు అంగుళాలతో ఫ్రిల్స్ ఇవ్వడం వల్ల మరింత ఆకర్షణీయంగా తయారైంది.
రితీషా రెడ్డి,
ఇషా డిజైనర్ హౌస్, follow us on:instagram.com/
riteshareddy, 7013639335