గుడుంబా నిర్మూలన కోసం..
జిల్లాలో గుడుంబా తయారీ, నల్లబెల్లం వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. అందుకు ఆ శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.నాగేందర్రావు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు.
- అరికట్టేందుకు ఇతర జిల్లాల ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
- వ్యాపారులకు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా
- ఈ ఏడాది 691 కేసుల్లో 972 మంది అరెస్ట్
- 2,900 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు
జిల్లాలో గుడుంబా నిర్మూలన కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దాడులు చేసేందుకు జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులను రప్పిస్తున్నారు. బెల్లం వ్యాపారులకు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు 691 కేసుల్లో 972 మంది నిందితులను అరెస్ట్ చేశారు. దాడుల్లో భారీగా బెల్లం, పటిక, గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. జనవరి వరకు గుడుంబా సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆ శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.నాగేందర్రావు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు.
మహబూబాబాద్, నవంబర్ 16 : జిల్లాలో గుడుంబా తయారీ, నల్లబెల్లం వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. అందుకు ఆ శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.నాగేందర్రావు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పనిచేసే ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులను రంగంలోకి దింపుతున్నారు. అంటే ఇక్కడ గుడుంబా, నల్లబెల్లం వ్యాపారాలు ఎంతగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నల్లబెల్లం వ్యాపారాలు చేస్తున్న వారిలో ఈ ఏడాది ఐదుగురిపై పీడీ యాక్టు నమోదు చేశారు. ఇంకా పలు కేసుల్లో ఎక్కువ సార్లు నిందితులుగా వారి జాబితాను తీస్తున్నారు. బెల్లం వ్యాపారులకు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాదిలో అక్టోబర్ వరకు 691 కేసుల్లో 972 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. వారి నుంచి 2,900 క్వింటాళ్ల నల్లబెల్లం, 160 క్వింటాళ్ల పటిక స్వాధీనం చేసుకుని, 4,190లీటర్ల గుడుంబా, 63,050 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 1,874 మందిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. అందులో బైండోవర్‌ను ఉల్లంఘించిన 113మందిపై బ్రీచ్ కేసులు నమోదు చేయడంతోపాటు 20మందికి జైలుకు పంపినట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది బైండోవర్ ఉల్లంఘించిన వారి నుంచి రూ.33లక్షల 35వేలను చలాన్ల ద్వారా జరిమానాలు విధించారు.
జనవరిలో పూర్తిగా నిర్మూలిస్తాం
జిల్లా డిసెంబర్ 1 నుంచి గుడుంబా, నల్లబెల్లం వ్యాపారులపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తాం. వారి కదలికలపై ప్రత్యేక దృష్టిపెడుతాం. జిల్లాలో జనవరి వరకు గుడుంబాను పూర్తిగా నిర్మూలిస్తాం. మహబూబాబాద్, తొర్రూరు, గూడూరు ఎక్సైజ్ సీఐలతోపాటు జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి కృష్ణ, ములుగు, భూపాలపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో ప్రత్యేక దాడులు నిర్వహిస్తాం. గతంలో గుడుంబా తయారీ, విక్రయాలు, నల్లబెల్లం సరఫరా చేసిన వారిపై నిఘా ఉంచుతాం.
– ఆర్.నాగేందర్రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

